విడుదలకు ముందే బాహుబలి రికార్డు బ్రేక్

Sardaar Gabbar Singh Breaks Bahubali Record

01:57 PM ON 4th April, 2016 By Mirchi Vilas

Sardaar Gabbar Singh Breaks Bahubali Record

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం "సర్దార్ గబ్బర్ సింగ్" . పవన్ కళ్యాణ్ స్వయంగా రెండేళ్ళు కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాడు . ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందు రాబోతున్న ఈ సినిమా పై రోజు రోజు కు అంచానాలు పెరిగిపోతున్నాయి .

సర్దార్ సినిమాను పవన్ కళ్యాణ్ తన మిత్రుడు ప్రొడ్యూసర్ శరత్ మారార్ తో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాడు. సర్దార్ సినిమా రైట్స్ ను కొనుగోలు చేసింది ఎరోస్ సంస్థ . విడుదలకు ముందే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా 100 కోట్ల బిజినెస్ చేసిందంటే ఈ సినిమా పై ఉన్న అంచనాలు ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక విడుదలకు ముందే సర్దార్ సినిమా రికార్డ్లు సృష్టించింది . సర్దార్ సినిమాను ఇండియా లోనే కాక యూకే, యూఎస్ఏ,ఆస్ట్రేలియా , కెనడా , గల్ఫ్ వంటి దేశాలలో పాటు పలు ఆఫ్రికా , యూరోప్ ఇలా మొత్తం 40 దేశాలలో విడుదల చెయ్యనున్నారు. హిందీ లో కుడా రికార్డు స్థాయిలో 800 ధియేటర్లలొ విడుదల చెయ్యనున్నారు. ఇలా ఒక్క తెలుగు సినిమా 40 దేశాలలో విడుదల అవుతుండడం ఇదే మొదటిసారి.

ఈ రికార్డులు అన్ని ఒక ఎత్తైతే , తెలుగు సినిమా గౌరవాన్ని అమాంతం పెంచిన బాహుబలి సినిమా రికార్డును సైతం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా బద్దలు కొట్టింది. హైదరాబాద్ లోని మూసాపేట్ ప్రాంతంలో బాహుబలి సినిమా ఒక షోను 7 లక్షలకు సొంతం చేసుకోగా , తాజాగా బాహుబలి రికార్డును సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా బద్దలు కొట్టింది . సర్దార్ సినిమా షో ఏకంగా 12.5 లక్షలకు అమ్ముడై బాహుబలి చిత్రం నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది.

విడుదలకు ముందే ఇన్ని రికార్డులను బద్దలు కొడుతుండడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందోత్సాహాలలో మునిగి తెలుతున్నారు.

ఇవి కుడా చదవండి :

'ఊపిరి' నిర్మాతలు మోసం చేసారు:రాజా రవీంద్ర

సర్దార్ టికెట్ల కోసం ఇంటినే అమ్మేశాడు

తన 150వ చిత్రం టైటిల్ ను ప్రకటించిన చిరు..

English summary

Power Star Pawan Kalyan's Upcoming Movie Sardaar Gabbar Singh Movie was going to be released on April 8th on The Occasion Of "Ugadi" festival. Sardaar Gabbar Singh Movie Created New Record with the first film to release in 40 Countries . Now this movie created New Record by Beating Bahubali Movie. Sardaar Gabbar Singh Movie Show in Moosapet , Hyderabad was sold to 12.5 Lakhs by Beating Bahubali record of 7 Lakhs.