సర్దార్‌గబ్బర్‌సింగ్‌ ట్రైలర్‌ అదిరిపోయింది

Sardaar gabbar singh latest trailer released

03:28 PM ON 21st March, 2016 By Mirchi Vilas

Sardaar gabbar singh latest trailer released

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. నిన్న హైదరాబాద్‌లో జరిగిన ఆడియో పంక్షన్‌ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిధి చిరంజీవి. ఆడియో పంక్షన్‌లో ఆడియోతో పాటు ట్రైలర్‌ ని కూడా విడుదల చేసారు. ఈ చిత్రం టీజర్‌ మంచి రెస్పాండ్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా రిలీజ్‌ అయిన సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ట్రైలర్‌ ఎలా ఉందో తెలుసుకుందామా.

మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న గ్రామం రతన్‌పూర్‌లో స్టార్ట్‌ అవుతుంది సర్దార్‌ ట్రైలర్‌. ఈ ఊరిలో ఉండే బైరవ్‌సింగ్‌ అనే వాడే విలన్‌. అదే ఊరిలో రాజకుమారిగా కాజల్‌ అగర్వాల్‌ కన్పిస్తుంది. బైరవ్‌సింగ్‌ కాజల్‌ మీద కన్నేస్తాడు. అతడి బారి నుండి కాజల్‌ ని కాపాడడానికి ఎస్సై నుండి సిఐగా ప్రమోషన్‌ ఇచ్చి పవన్‌ ని రతన్‌పూర్‌ పంపిస్తారు. అక్కడ మన హీరో ఏం చేసాడనేదే ఈ చిత్రం స్టోరీ. దాదాపు స్టోరీ అంతా ట్రైలర్‌లోనే చూపించే ప్రయత్నం సర్దార్‌ టీం చేసారు. ఈ చిత్రానికి స్టోరీ అండ్‌ స్క్రీన్‌ ప్లే అందించిన పవన్‌ ఎలా అలరించాడో చూడాలంటే వేచి చూడాల్సిందే. ఫస్ట్‌ చాలా కామెడీగా నడుస్తుందని ఆ తరువాత సీరియస్‌గా బైరవ్‌సింగ్‌ను ఎదుర్కొంటాడని అర్ధం అవుతుంది ఈ ట్రైలర్‌ చూస్తుంటే.

ఇక సినిమాలో పవన్‌ ఎనర్జీ, డైలాగ్‌లు, స్టెప్స్‌ ఈ చిత్రానికి ప్లస్‌ అనే చెప్పాలి. దేవీశ్రీ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా సూపర్‌గా ఉంది. ట్రైలర్‌ లో పవన్‌ చెప్పే డైలాగ్‌ 'ఓయ్‌ పేరు గుర్తుందిగా... సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' అంటూ అదరగొట్టాడు పవన్‌. పవన్‌ స్టైల్‌ అందరికీ తెలిసిందే కాని తన మాస్‌ హీరోయిజాన్ని ఇంకాస్త రుచి చూపించడానికి రెడీగా ఉన్నాడు పవన్‌.

English summary

Sardaar Gabbar Singh is an upcoming Telugu action film directed by K. S. Ravindra. Sardaar gabbar singh latest trailer released yesterday.