సర్దార్ ప్రమోషనల్ సాంగ్

Sardaar Gabbar Singh Promotional Song

03:57 PM ON 12th March, 2016 By Mirchi Vilas

Sardaar Gabbar Singh Promotional Song

తెలుగు చాల చిత్ర సీమలో పవర్ స్టార్ గా పిలుచుకునే పవన్ కళ్యాణ్ కు ఉన్నంత క్రేజ్ అంత ఇంత కాదు. టాలీవుడ్ లో అ హీరోకు లేని విధంగా పవన్ కళ్యాణ్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటు సినిమాలలోను అటు రాజకీయాలలోనూ తనదైన శైలిలో దూసుకుపోతుంటాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చెబితే ఓకే అన్నట్లుగా అయన ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను అనేక సందర్భాలలో శిరసా వహించి చూపించారు. తన వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. అలాంటిది పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఆ క్రేజే వేరు.

ఇక వివరాలోకి వెళ్తే ..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం ఏప్రిల్ 8 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి ఒక ఫస్ట్ లుక్ టీజర్ తప్ప వేరే ఏ విధమైన వీడియో కానీ ,ఫోటో కానీ విడుదల కాలేదు .అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేసి పవన్ పై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ సాగే ఈ పాట పవన్ కళ్యాణ్ అభిమానులని సైతం అక్కట్టుకుంటూ ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది .

పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా పై తెరకెక్కిన ఈ పాటకు కేశవ్ కిరణ్ సంగీతాన్ని అందించగా , రేవంత్ ఈ పాటను అద్భుతంగా పాడి పవన్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు . సర్దార్ సినిమా పై తెరకెక్కిన ఈ పాట అనేక మంది ప్రశంసలు అందుకుంది. ఆ పాట మీ కోసం..

English summary

Pawan kalyan had huge fan following and he had soo many die hard fans than other heroes in the industry.Pawan kalyan was presently acting in Sardar gabbar Singh Movie in the direction of director babi.This movie was going to be released on April 8th and recently some of his fans made a promotional song of Sardar Gabbar Singh movie and uploaded in YouTube and now that video was going viral over the internet.