సర్దార్ గురి తప్పిందా?

Sardaar Movie Unit Switched Off Their Phones

12:32 PM ON 9th April, 2016 By Mirchi Vilas

Sardaar Movie Unit Switched Off Their Phones

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో దీనికీ లేనంత ప్రచారం తెచ్చుకున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమా హిట్టయ్యిందంటూ ఉగాది సందర్భంగా పవన్ ఫ్యాన్స్ ఒకటే హంగామా! అటు థియేటర్లు.. ఇటు సోషల్ మీడియా లోపల ఒకటే హడావుడి సరేసరి ... ఇంతకీ అభిమానులు చెబుతున్నట్లుగా సినిమా ఆ రేంజ్‌లో వుందా? అనే ప్రశ్న ఇప్పుడు రైజ్ అవుతోంది. కొన్నిచోట్ల థియేటర్లలో రభస, షోలు ఆగిపోవడం వంటి ఘటనలు కూడా పవన్ సినిమాల్లో ఇదే తొలిసారి.

ఇవి కూడా చదవండి: సర్దార్ తల్లి అలా అనేసారేంటి?

ఒకవేళ అభిమానులు చెబుతున్నట్టు ఓ రేంజ్‌లో మూవీ వుంటే, ఇంత గందరగోళం అవసరమా? అనే మాట వినిపిస్తోంది. ఇక విడుదలరోజు ఈవెనింగ్ కల్లా ముఖ్యమైన నగరాల్లో ‘సర్దార్’ థియేటర్స్ ఖాళీగా వున్నాయని టాక్ హల్ చల్ చేస్తోంది. మరికొందరైతే థియేటర్స్‌కి వెళ్లి తలనొప్పి తెచ్చుకునే బదులు ముందుగానే డ్రాపైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రకరకాల ప్రాంతాల్లో థియేటర్స్ వద్ద జరిగిన హంగామా గురించి తెలుసుకోవాలని మీడియా వాళ్ళు ఫోన్ చేయాలని ప్రయత్నిస్తే, సర్దార్ యూనిట్‌ ఫోన్లల్నీ స్విచ్ఛాఫ్! అయి వున్నాయట. దీంతో ఫిల్మ్ రిపోర్టర్స్ షాక్ అయ్యారట. ఇక కలెక్షన్స్ పరంగా ఫస్ట్ డే పరవాలేదని, అయితే వీకెండ్ మాత్రం కష్టమేనని పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారట. మరి లెక్క ఎక్కడ తప్పిందబ్బా?

ఇవి కూడా చదవండి:

సర్దార్ సినిమా కోసం కత్తులతో దాడి.. ఒకరి మృతి

పవన్ 2 రూపాయల ఆర్టిస్ట్

సర్దార్ తోనైనా పవన్ కళ్ళు తెరవాలన్న వర్మ

English summary

Power Star Pawan Kalyan's Sardaar Gabbar Singh movie was released yesterday and this movie going with a mixed talk and a recent news that Sardaar Gabbar Singh movie unit was switch off their phones when media persons tried to call them on the response of Sardaar Movie.