పవన్ ఇంటి ముందు ధర్నా చేస్తానన్న బాబీ

Sardar director Bobby said that i will do protest at Pawan home

06:42 PM ON 2nd April, 2016 By Mirchi Vilas

Sardar director Bobby said that i will do protest at Pawan home

రవితేజ నటించిన 'పవర్' చిత్రంతో తెలుగు తెరకు దర్శకుడిగా మొదలైన కె.ఎస్. రవీంద్ర అలియాస్ బాబీ మొదటి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ.. మంచి కధలు అందిస్తూ.. దర్శకుడిగా అవకాశాన్ని దక్కించుకున్నాడు. అయితే పెద్ద పెద్ద దర్శకులే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోతో సినిమా తియ్యాలని క్యూ కడుతుంటే, అలాంటిది బాబీ తన రెండో చిత్రానికే పవన్ ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. దీంతో ఇప్పుడు బాబీ అంటే తెలియని వాళ్ళు లేరు, సర్దార్ చిత్రం హిట్ అయితే గనుక బాబీ ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిపోతాడు.

అయితే బాబీ కి అంత లైఫ్ ఇచ్చిన పవన్ ఇంటి ముందు ధర్నా చెయ్యడానికి కారణమేంటి అనే విషయం గురించి వివరించాడు. ముందు పవన్ చిత్రానికి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎలా వచ్చింది అని అడిగితే.. పవన్ గారి ఫ్రెండ్ శరత్ మరార్ గారు నాకు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారిని కలవమని చెప్పారు. అప్పుడు నేను పవన్ క‌ళ్యాణ్ గారి ఫామ్ హౌస్ కి వెళ్లి క‌లిసాను. అయన ఒక కథ వినిపించారు. కథ అయిపోయాక, ఈ కథకి నువ్వే దర్శకుడివి అన్నారు. మొదట కలలా అనిపించింది, తర్వాత జోక్ చేస్తున్నారు అనుకున్నాను. కానీ ఆ వార్త మీడియా లో వచ్చాక నిజమని నమ్మాను.

అయితే పవన్ కళ్యాణ్ గారు ఇంకో రెండో మూడో సినిమాల తరవాత సినిమా లకి దూరమవుతారు అని చెప్పారు, దీనికి మీరేమంటారు అని బాబీ ని అడిగితే, క‌ళ్యాణ్ గారు సినిమాలు చేయ‌డం మానేస్తారని నేను అనుకోవ‌డం లేదు. ఒకవేళ పవన్ క‌ళ్యాణ్ గారు సినిమాల్లో న‌టించ‌డం మానేస్తే, అయన ఇంటి ముందు ధ‌ర్నా చేసి, అయన మళ్ళీ సినిమాల్లోకి వచ్చే దాక బయటే ఉంటాను. ఆ ధర్నా చేసేవాడిగా మొదటి ప్లేస్ లో నేనుంటానని నవ్వుతూ చెప్పాడు.

English summary

Sardar director Bobby said that i will do protest at Pawan home. Sardar Gabbar Singh director K. S. Ravindar(Bobby) said that i will do protest at Pawan Kalyan home.