'సర్దార్‌' టీజర్‌కు సరికొత్త రికార్డ్‌!!

Sardar Gabbar Singh 2nd teaser creates new record

01:06 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Sardar Gabbar Singh 2nd teaser creates new record

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ 'గోపాల గోపాల' చిత్రం తరువాత నటిస్తున్న తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' పవన్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, రాయ్‌ లక్ష్మీ, సంజన ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. 'పవర్‌' ఫేమ్‌ బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఘాటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన రెండవ టీజర్‌ని సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఈ టీజర్‌ విడుదలైన 48 గంటల్లోనే 10 లక్షల వ్యూలు వచ్చి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ టీజర్‌కు లైకులు కూడా విపరీతంగా వచ్చాయి. టీజర్‌కే ఇంత స్పందన వస్తే ఇంక ట్రైలర్‌కు ఏ విధమైన స్పందన వస్తుందో అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. వేసవి కానుకగా మే నెలలో విడుదలవబోతున్న ఈ చిత్రాన్ని శరత్‌ మారర్‌ నిర్మిస్తున్నారు.

English summary

Sardar Gabbar Singh 2nd teaser creates new record in 48 hours with 10 lakhs views. Power Star Pawan Kalyan and Kajal Agarwal is sharing screen first time with this movie.