మార్చ్‌లో రిలీజ్‌ కానున్న 'సర్దార్‌' ఆడియో

Sardar Gabbar Singh audio in March

11:29 AM ON 23rd January, 2016 By Mirchi Vilas

Sardar Gabbar Singh audio in March

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ తన రాబోయే సినిమా 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' తో ప్రేక్షకులను కనువిందు చెయ్యనున్నాడు. ఇటీవల సంక్రాంతి కానుకగా ఈ సినిమాకి సంబంధించిన మూడు ఫోటోలను రిలీజ్‌ చేశారు. ఈ ఫోటోలు సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి. ఈ సినిమా ఆడియోను మార్చి 12న రిలీజ్‌ చేయడానికి సినిమా యూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నారు అని సమాచారం. ఎనర్జిటిక్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీశ్రీప్రసాద్‌ ఈ సినిమాకి సంగీతం అందించాడు. పవన్‌ అభిమానులకి నచ్చే విధంగా అద్భుతమైన పాటలను దేవీ సమకూర్చాడు. ప్రస్తుతం ఈ సినిమాలో ప్రధాన పాత్రల పై ఉన్న కీలక సన్నివేశాలను హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాలో పవన్‌ తో కాజల్‌ జతకట్టింది. రాయ్‌లక్ష్మీ ఒక స్పెషల్‌ సాంగ్‌లో పవన్‌ సరసన కనిపించనుంది. ఏప్రిల్‌ 8న ఈ సినిమాను విడుదల చేయడానికి సినిమా యూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

English summary

Sardar Gabbar Singh audio on March 12th. Kajal Agarwal is romancing first time with Power Star Pawan Kalyan. Power fame Bobby is directing this movie.