మార్చి 20న 'సర్దార్‌' ఆడియో.. వేదిక ఇదా..!

Sardar Gabbar Singh audio launch on March 20

05:11 PM ON 16th March, 2016 By Mirchi Vilas

Sardar Gabbar Singh audio launch on March 20

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. 'పవర్‌' ఫేమ్‌ బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పవన్‌ స్నేహితుడు శరత్‌ మారర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, సంజన, రాయ్‌ లక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆడియో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వారికి శుభవార్త. ఈ చిత్రం ఆడియోని ఈ నెల 20న హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో విడుదల చేయబోతున్నారు. ఈ ఆడియో కి మెగా ఫ్యామిలీ మొత్తం రాబోతుందని సమాచారం. ఈ కార్యక్రమాన్ని ఎంతో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారని సమాచారం.

ఈ ఆడియో వేడుక తరువాత 'సర్దార్‌' టీమ్‌ కొన్నిసాంగ్స్‌ చిత్రీకరణ కోసం యూరప్‌ వెళ్లనుందట. ఈ చిత్రం ఏప్రిల్ 8న అత్యధిక ధియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయ్యబోతున్నారు. ఈ చిత్రంలో పవన్ ఒక పాటని కూడా ఆలపించారు.

టాలీవుడ్ హీరో ల పారితోషికాలు!!

తారలు..వారి భార్యలు

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం

మీ రాశి ప్రకారం ఎ కెరీర్ లో బాగా రాణిస్తారు

English summary

Sardar Gabbar Singh audio launch on March 20. Power Star Pawan Kalyan is acting as a hero in this movie. Kajal Agarwal, Sanjana, raai Laxmi are acting as a heroines in this movie.