ఇంకా రెండు పాటలు ఉండగానే... సర్దార్ కి  సెన్సార్

Sardar Gabbar Singh censor report

05:21 PM ON 1st April, 2016 By Mirchi Vilas

Sardar Gabbar Singh censor report

ఓ సినిమా తీయడానికి పడ్డ కష్టానికి తొలి మెట్టు సెన్సార్... అది వచ్చాకే విడుదల... అప్పుడు ప్రేక్షకుల రెస్పాన్స్ బట్టి ఆ సినిమా సంగతేమిటో తేలిపోతుంది. ఆ తొలి మెట్టు ఎక్కేసింది 'సర్దార్ గబ్బర్ సింగ్'... ఎందుకంటే దీనికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేసింది. సెన్సార్ బోర్డ్ యూ/ఎ సర్టిఫికెట్ తో సర్దార్ కు ముద్ర పడింది. విచిత్రమేంటంటే, రెండు పాటలు ఇంకా సినిమాలో పెట్టకుండానే సెన్సార్ అయిపోయిందన్న టాక్ నడుస్తోంది. నిజానికి స్విట్జర్లాండ్ లోనే పాటల్ని ఆన్ లైన్ ఎడిటింగ్ చేయించేసి పంపించేశాడు పవన్. దాంతో పెద్దగా టైం తీసుకోకుండానే, ఆ రెండు పాటల్ని మిక్స్ చేసి ఫైనల్ కాపీలో ఇంక్లూడ్ చేసేయ్యవచ్చు.

ఇది కూడా చదవండి: సర్దార్ లో ఈ సీన్స్ కాపీ కొట్టారంటూ నోటిసులు

లేదా పాటలకు విడిగా సెన్సార్ చేయించి ఆ తర్వాత సినిమాలో యాడ్ చేసే ఛాన్స్ కూడా సర్దార్ టీంకు ఉంది. సినిమాకు క్లీన్ యు ఇస్తామని, కానీ ఫైట్స్ లో వయొలెన్స్ సీన్స్ కొన్ని కట్ పడాలని బోర్డ్ చెప్పిందని తెలుస్తోంది. కానీ అసలైన కిక్కు ఫైట్స్ లోనే ఉన్నందున, కట్స్ లేకుండా యూ/ఎ సర్టిఫికెట్ తోనే బయటికొచ్చారు సర్దార్ టీం. ఏప్రిల్ 8న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న సర్దార్ కోసం ఇప్పటి నుంచీ ప్రచార కార్యక్రమాల్లో సర్దార్ టీం బిజీ అయిపొయింది. వారం రోజుల్లో స్క్రీన్ పై సర్దార్ బొమ్మ పడ్డాక, చూసెయ్యడానికి ప్రేక్షకులతో పాటూ పవన్, అన్నయ్య మెగాస్టార్ కూడా రెడీగానే ఉన్నారు. ఏది ఏమైనా ఈ చిత్రం పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇది కూడా చదవండి: కొత్త యాంగిల్ చూపిస్తున్న లావణ్య త్రిపాఠి

English summary

Sardar Gabbar Singh censor report. U/A certificate for Sardar Gabbar Singh censor report.