'సర్దార్‌' ఇంటర్వెల్‌ డైలాగ్‌ లీక్‌

Sardar Gabbar Singh interval dialogue leaked

10:53 AM ON 5th April, 2016 By Mirchi Vilas

Sardar Gabbar Singh interval dialogue leaked

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటించిన తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. కె.ఎస్‌. రవీంద్ర తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. అయితే ఈ చిత్రం విడుదల కాక ముందే ఇంటర్వెల్ సన్నివేశానికి సంబంధించిన ఒక డైలాగ్‌ లీకైంది. అది ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తుంది. ఆ డైలాగ్‌ ఏంటంటే పవన్‌ విలన్‌ కి వార్నింగ్‌ ఇచ్చే డైలాగ్‌ అట. 'నిన్న మొన్న నాకు అనవసరం.. నేను వచ్చాక రూల్‌ మారాలి.. రూలింగ్‌ మారాలి.. టైమ్‌ మారాలి.. టైమ్‌ టేబుల్‌ మారాలి'.. ఇదే ఇంటర్వెల్‌ లో వచ్చే డైలాగ్‌. వినడానికి చాలా పవర్‌ ఫుల్‌గా ఉన్న ఈ డైలాగ్‌ ఇంక ధియేటర్‌లో పవన్‌కళ్యాణ్‌ చెబితే ఏ రేంజ్‌లో విజిల్స్‌ పడతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇది అవ్వడానికి సినిమాలో డైలాగే అయినా దీని వెనుక వేరే అర్ధం కూడా ఉంది. పవన్‌ త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నాడు కాబట్టి వచ్చాక ఎలా ఉండాలో ముందుగానే తెలియజేస్తున్నట్లు అర్ధమవుతుంది. అయితే ఈ డైలాగ్‌ వినాలంటే మరో 3 రోజులు ఆగాల్సిందే.

English summary

Sardar Gabbar Singh interval dialogue leaked. Sardar Gabbar Singh interval bang dialogue leaked.