రికార్డు సృష్టిస్తున్న 'సర్దార్‌' మేకింగ్‌ వీడియో

Sardar Gabbar Singh making video

11:16 AM ON 14th March, 2016 By Mirchi Vilas

Sardar Gabbar Singh making video

దాదాపు రెండేళ్లు తరువాత పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. 'పవర్‌' ఫేమ్‌ కె. ఎస్‌. రవీందర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, సంజన, రాయ్‌ లక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవన్‌ స్నేహితుడు శరత్‌ మారర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఏప్రిల్‌ 8న విడుదలవబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ అప్పుడే మొదలు పెట్టేశారు. ఈ చిత్రానికి సంబంధించిన 40 సెకన్ల మేకింగ్‌ వీడియో అధికారికంగా ఇంటర్నెట్‌లో విడుదల చేశారు. ఈ మేకింగ్‌ వీడియోలో హైదరాబాద్‌, గుజరాత్‌, రామోజీ ఫిలింసిటీ వంటి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన సన్నివేశాలున్నాయి.

ఈ వీడియోని చూస్తుంటే ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా చాలా అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో పవన్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన గన్‌, సర్దార్‌ బులెట్‌, 303 గన్స్‌ మరియు ఫై˜ట్‌ సన్నివేశాలు ఉన్నాయి. ఇందులో కాజల్‌, దర్శకుడు బాబీ మరియు గన్‌ ఫైరింగ్‌ సన్నివేశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఈ నెలలోనే విడుదల కాబోతుంది.

1/17 Pages

మేకింగ్ వీడియో:

'సర్దార్ గబ్బర్ సింగ్' మేకింగ్ వీడియో ఇదే. 

దీనితో పాటు 'సర్దార్ గబ్బర్ సింగ్ వర్కింగ్' స్టిల్స్ మీరు ఇంత వరకు చూడనివి మీకోసం.

English summary

Powerstar Pawan Kalyan upcoming sensation movie Sardar Gabbar Singh making video has been released by movie unit. Please watch it.