'సర్దార్' కాపీ లీక్! సీడీ షాపుల పై పోలీసులు దాడి

Sardar Gabbar Singh movie copy leaked

10:28 AM ON 7th April, 2016 By Mirchi Vilas

Sardar Gabbar Singh movie copy leaked

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా విడుదల కాక ముందే మొదటి భాగం మొత్తం సీడీల రూపంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా కి పని చేసిన ల్యాబ్ టెక్నీషియన్ ఏ ఆ పని చేశాడని తెలియడంతో వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయినా సరే 'అత్తారింటికి దారేది' చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద రికార్డు లు సృష్టించి కాసులు కొల్లగొట్టిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా రేపు విడుదల కానున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం కూడా లీక్ అయిందన్న వార్తలు రావడంతో పోలీసులు అనేక చోట్ల సీడీ షాపుల పై దాడులు నిర్వహించారు.

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ కి రూ 700 జరిమానా

మళ్లీ ఈ చిత్రానికి పని చేసిన కొందరు టెక్నీషియన్ లు ల్యాబ్ నుంచి కాపీ చేసుకుని 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం లీక్ చేశారని రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇవ్వడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ముఖ్యంగా ప్రొద్దుటూరులోని సీడీ షాపులలో సీడీలను తయారు చేసి మరో చోటుకి తరలించే దుకాణాలలో హార్డ్ డిస్క్‌లు, సీడీ రైటర్‌ లను పోలీసులు పరిశీలించారు. ఈ దాడిలో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళని విచారించగా 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి సంబంధించిన సీడీలు దొరకలేదని పోలీసులు తెలియజేయ్యడంతో అభిమానులు, సినిమా కొన్న డిస్‌ట్రిబ్యుటర్ లు ఉపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: పవన్ పై ఉదయ కిరణ్ ఆరోపణలు

English summary

Sardar Gabbar Singh movie copy leaked by technicians. Police ride on CD shops.