స్విస్ లో సర్దార్ డ్యూయట్స్

Sardar Gabbar Singh Movie Shooting in Switzerland

10:44 AM ON 8th March, 2016 By Mirchi Vilas

Sardar Gabbar Singh Movie Shooting in Switzerland

భారీ అంచనాలు నెలకొన్న 'సర్దార్' ఇప్పుడు స్విట్జర్లాండ్ లో హల్ చల్ చేయనున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ‘సర్దార్’ చిత్రాన్ని నార్త్‌స్టార్ ఎంటర్టైన్‌మెంట్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ సాంగ్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇది పూర్తి చేసుకుని మరో రెండు పాటల కోసం చిత్ర బృందం స్విట్జర్లాండ్ పయనమవనుంది. పవన్, కాజల్‌పై తెరకెక్కనున్న ఈ పాటల చిత్రీకరణతో ‘సర్దార్’ సినిమా షూటింగ్‌కి ముగింపు పలుకుతారట. ఈరోస్ సంస్థ విడుదల చేయనున్న ఈ చిత్రానికి మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. కాగా ఏప్రిల్ 8న విడుదలవుతున్నట్టు నిర్మాత శరత్ మరార్ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

English summary

Power Star Pawan Kalyan's Upcoming movie Sardar Gabbar Singh movie shooting was presently going in Hyderabad and this movie last Schedule to done in Switzerland.In Switzerland the movie unit was going to shoot a song between Pawan Kalyan and Kajal Agarwal.This movie was directing by Babi and this movie was going to be released on April 8th.