'న్యూఇయర్'కి పవన్‌ ఫ్యాన్స్‌కి పండగే!!!!

Sardar Gabbar Singh new Teaser on New Year day

05:56 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Sardar Gabbar Singh new Teaser on New Year day

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ దాదాపు రెండు సంవత్సరాలు తరువాత నటిస్తున్న చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. 'పవర్‌' ఫేమ్‌ బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ సరసన మొదటిసారి కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో ఇద్దరు హీరోయిన్లు రాయ్‌ లక్ష్మీ, సంజన ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శరత్‌ మారర్‌, పవన్‌ కళ్యాణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఘాటింగ్‌ ప్రస్తుతం గుజరాత్‌లో జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మార్చిలో విడుదల చేయబోతున్నారు. అయితే మరో 18 రోజుల్లో వచ్చే న్యూఇయర్ కి పవన్‌ తన అభిమానులకు ఒక గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాడు.

అదేంటంటే పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజునాడు పవన్‌ అభిమానుల కోసం 'సర్దార్‌' టీజర్‌ రిలీజ్‌ చేయించారు. ఈ టీజర్‌కు ఇంటర్నెట్‌లో విపరీతమైన స్పందన లభించింది. ఇప్పుడు అదే మనసులో ఉంచుకుని న్యూఇయర్‌ రోజు సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ కొత్త టీజర్‌ని అభిమానుల కోసం విడుదల చేస్తున్నారు. ఇది మొదటి టీజర్‌ కంటే కొంచెం ఎక్కువ నిడివి ఉండే టీజర్‌గా విడుదల చేస్తున్నారు. న్యూఇయర్‌ రోజున నిజంగా పవన్‌ అభిమానులకి ఇది పండగనే చెప్పాలి.

English summary

Sardar Gabbar Singh new Teaser on New Year day for Pawan Kalyan fans.