హడావుడే ‘సర్దార్’ కి శాపంగా మారిందా?

Sardar Gabbar Singh reviews and public talk

10:07 AM ON 11th April, 2016 By Mirchi Vilas

Sardar Gabbar Singh reviews and public talk

గత కొద్ది రోజులు నుంచి 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాకు జరిగిన హడావిడి అంతా ఇంతా కాదు. అందుకే యుఎస్ ప్రిమియర్స్ కలెక్షన్లలో రెండో స్థానం.. తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో నాన్ బాహుబలి రికార్డులు.. ఇంకా వసూళ్ల పరంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ప్రభంజనం బానే సాగుతోంది. అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లేదు.. అలాగని పూర్తి నెగెటివ్ టాక్ లేదు. అయితే ఎక్కడో తేడా మాత్రం జరిగిందని అందరూ అనే మాటే. ‘సర్దార్’ టీమ్ పడ్డ హడావుడే ఈ సినిమాకు శాపంగా మారిందని చాలా మంది విశ్లేషకుల మాటగా వుంది. ‘సర్దార్’ ద్వితీయార్ధంలో దాదాపు అరగంట సేపు సినిమాలో ఏ సన్నివేశాలొస్తాయో, ఏ క్యారెక్టర్ ఎలా ప్రవర్తిస్తుందో తెలియని స్థితి.

ఇది కూడా చదవండి: పుట్టింగల్‌దేవి ఆలయంలో అగ్నిప్రమాదం: 106 మంది మృతి

కథా గమనానికి అడ్డం పడుతూ ఇష్టానుసారం సన్నివేశాలు వచ్చిపోతుంటాయి. ఎడిటింగ్ విషయంలో దారుణమైన తప్పులు చోటు చేసుకున్నాయి. ఇష్టానుసారం కట్ అండ్ పేస్ట్ అన్నట్లుగా పని సాగిపోయిందని చెప్పక తప్పదు. విలన్ గ్యాంగును సర్దార్ ఆటాడుకునే సన్నివేశాల్ని ఎలా పడితే అలా ఎడిట్ చేసేశారు. అసలు కిక్కు లేదు. ఇక బ్రహ్మానందం-పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే గన్ ఫైట్ కూడా అంతే. ఇక టైటిల్ సాంగ్ విషయానికి వస్తే, ఫారిన్ లో తీసుకొచ్చిన రెండు పాటలు కూడా పేలవంగా అనిపిస్తాయి. చాలా హడావుడిగా ముగించేసారా అన్నట్టు వుంటుంది. ఈ పాటల విషయానికి వస్తే, ఓ కాన్సెప్ట్ అంటూ ఉండదు. ఏదో మొక్కుబడిగా అన్నట్లు వుంది.

ఇది కూడా చదవండి: కెమెరాకు చిక్కిన మత్స్య కన్య

అసలీ పాటల్లో పవన్ కు సరిగా లిప్ సింక్ కూడా అవ్వలేదనే విషయం కూడా యూనిట్ గమనించలేదు. ‘సర్దార్’ సినిమా 70 శాతం చివరి 50 రోజుల్లోనే షూట్ చేశామని పవన్ ఇదివరకు చెప్పాడు. అలా తీసిన సన్నివేశాల్ని సినిమాలో ఎలా పడితే అలా పేక ముక్కల్లా పేర్చేసినట్లు వుంది. నిడివి ఎక్కువైపోవడంతో కొన్ని సన్నివేశాల్ని ఇష్టానుసారం కట్ చేశారు. అయితే అవసరం లేని సన్నివేశాల్ని కూడా అలాగే వదిలేశారు. 'పవన్ ఎడిటింగ్ దగ్గర ఉండి.. బాబీతో కోఆర్డినేట్ చేసుకుని నెమ్మదిగా పని చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. దర్శకుడు బాబీ ఫ్రీ హ్యాండ్ తీసుకున్నట్లు(అసలు ఇచ్చారో లేదో) లేదు. పవన్ పట్టించుకున్నట్లూ లేదు. మొత్తానికి సినిమా మధ్యస్తంగా తయ్యారైంది' అంటూ పలువురు వీక్షకులు తేల్చేసారు.

ఇది కూడా చదవండి: ఎయిడ్స్ కి మందు పాము విషమట!

English summary

Sardar Gabbar Singh reviews and public talk. Sardar Gabbar Singh public talk and reviews.