సర్దార్ స్టోరీ లీక్!

Sardar Gabbar Singh story leaked

05:28 PM ON 23rd March, 2016 By Mirchi Vilas

Sardar Gabbar Singh story leaked

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రంలోని పాటలు, ట్రైలర్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. పవన్ కల్యాణ్ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని కె.ఎస్. రవీంద్ర తెరకెక్కించారు. ఏప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం స్టోరీ లీకై ప్రస్తుతం ఇంటెర్నెట్ లో హల్చల్ చేస్తుంది. లీకైన కథ ఇదే.. రతన్ పూర్ సంస్థానంలో భైరవ్ సింగ్ అనే మానవ మృగం అక్కడున్న ప్రజలని హింసిస్తూ ఉంటాడు. ఎప్పటిలాగే అక్కడ ప్రజలు ఎవరైనా మానవ రూపంలో ఉండే దేవుడు తమని రక్షించడానికి రాకపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు.

ఇది పక్కన పెడితే రతన్ పూర్ లో ఉండే ఓ యువరాణి(కాజల్ అగర్వాల్) మీద భైరవ్ సింగ్ కన్ను పడుతుంది. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకుని తనువు తీరా అనుభవించాలి అనుకుంటాడు. అయితే ఆ యువరాణి మాత్రం భైరవ్ సింగ్ చేసే దారుణాలని చూసి అసహ్యిచుకుంటుంది. అయితే భైరవ్ సింగ్ మాత్రం ఆ యువరాణి ని ఎలా అయిన దక్కించుకోవాలని అనుకుంటాడు. తన కూతుర్ని(కాజల్ అగర్వాల్) రక్షించేందుకు ఆమె తండ్రి భైరవ్ కన్నా(ముఖేష్ రిషి) బలవంతుడైన వ్యక్తికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో మన హీరో ఆ సంస్థానానికి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పోలీస్ ఆఫీసర్‌గా వస్తాడు.

ఆ తర్వాత ‘సర్దార్’ భైరవ్ సింగ్ దారుణాలని ఎలా అరికట్టాడు? అతని నుంచి యువరాణిని ఎలా కాపాడుతాడు? ఆమెను ఎలా వివాహం చేసుకుంటాడన్నదే మిగిలిన కథ. అయితే కథ రొటీన్ గానే ఉన్నా పవన్ తనదైన నటనతో సినిమా పై ఆసక్తి పెంచేలా చేశారు అనడానికి ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.

English summary

Sardar Gabbar Singh story leaked. Power Star Pawan Kalyan latest movie Sardar Gabbar Singh movie story leaked.