సంక్రాంతికి 'మెగా' సందడి కూడా ....

Sardar Gabbarsingh Teaser On

09:33 AM ON 8th January, 2016 By Mirchi Vilas

Sardar Gabbarsingh Teaser On

ఈ సంక్రాంతికి బాలయ్య డిక్టేటర్ ,, ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో ', నాగార్జున ' సోగ్గాడే చిన్ని నాయనే' సినిమాలతో సందడి చేయబోతుంటే, సందట్లో సడేమియా అన్నట్లు మధ్యలో శర్వానంద్‌ ' ఎక్స్‌ప్రెస్‌ రాజా' లా దూసుకొస్తున్నాడు. ఇక మెగా ఫ్యామిలీ కూడా సందడి చేయడానికి సన్నద్ధమవుతోంది. సంక్రాంతికి తమ హీరోల హంగామా లేదని మెగా అభిమానులు కాస్త నిరాశలో ఉన్న నేపధ్యంలో ఆ లోటును భర్తీ చేయడానికి పవన్‌ కల్యాణ్‌, అల్లుఅర్జున్‌ సన్నాహాలు చేస్తున్నారట. . నిజంగా ఈ సంక్రాంతికి వీళ్లూ హంగామా సృష్టంచబోతున్నారు. పవన్‌ ‘సర్దార్‌ - గబ్బర్‌సింగ్‌’, అల్లుఅర్జున్‌ ‘సరైనోడు’ టీజర్లు సంక్రాంతి పండక్కి రెడీ. నిజానికి జనవరి 1వ తేదీనే టీజర్లు విడుదల కావాల్సి వున్నా , సాంకేతిక కారణాల వల్ల... సంక్రాంతి వరకూ సాగింది. అయితే ‘సర్దార్‌ - గబ్బర్‌సింగ్‌’, ‘సరైనోడు’ సినిమాలూ రెండూ వచ్చే వేసవికే విడుదల కానున్నాయి.

English summary

Pawan Kalyan's upcoming film sardar gabbar singh teaser was to be initially released on Jan 1st but due to some problems it has been postponed.Now the teaser of that film was going to be released for Sankranthi Festival