హోటెల్లో 'సర్దార్' మెనూ

Sardar menu in Bhimavaram hotel

05:56 PM ON 7th April, 2016 By Mirchi Vilas

Sardar menu in Bhimavaram hotel

‘సర్దార్ గబ్బర్‌సింగ్’ మేనియా ప్రస్తుతం హోటళ్ళకూ కూడా పాకింది. మరి కొద్ది గంటల్లో విడుదల కానున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం తాజాగా భీమవరంలోని ఓ హోటల్లో సర్దార్ మెనూ అంటూ కస్టమర్ లను ఆకర్శిస్తున్నారు. రండి బాబు రండి ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఆఫర్.. మా ఆఫర్‌కి కొంచెం తిక్కుంది.. కానీ దానికో టేస్ట్ ఉంది’ అని ఆ మెనూకు ట్యాగ్‌లైన్ కూడా పెట్టారు. ఆ మెనూ లో ఐటమ్స్ ఎంటంటే ‘సర్దార్’ స్పైస్ రైస్, కాజల్ కర్డ్ రైస్, బుల్లెట్ స్నాక్స్, డీఎస్పీ కర్రీ అని ఆ మెనూలో తినే పదార్థాలకు వెరైటీగా ఈ చిత్రంలో నటించిన వారి పేర్లు ముందు పెట్టి ఐటమ్స్ పేర్లు జత చేశారు. ఇవి అప్పుడే కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ఎయిడ్స్ కి మందు పాము విషమట!

గతంలో ‘బాహుబలి’ సినిమా విడుదలైనప్పుడు కూడా ఇలాంటి ప్రయోగమే చేశారు. ఇప్పుడు తాజాగా పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి చేస్తున్నారు. ఇంకా ఈ సినిమా కి మామూలుగా పబ్లిసిటీ చెయ్యడం లేదు గా అని పవన్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మీకు కూడా కావాలంటే వెళ్ళి సర్దార్ ఐటమ్స్ ని తినేయండి.

ఇది కూడా చదవండి: ఎయిర్ హోస్టెస్ లు విమానంలో ఆ పనులు కుడా చేస్తారట

English summary

Sardar menu in Bhimavaram hotel. Sardar Gabbar Singh menu in Bhimavaram hotel.