సర్దార్‌ పై గుడుంబా శంకర్ కామెంట్లు

Sardar Movie Comparing With Gudumba Shankar

06:20 PM ON 18th March, 2016 By Mirchi Vilas

Sardar Movie Comparing With Gudumba Shankar

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ . ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని పవన్ అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే . ఈ చిత్రానికి రవితేజతో పవర్ సినిమా తీసి హిట్ కొట్టిన డైరెక్టర్ బాబి ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నాడు. ఈ చిత్రం లో పవన్ సరసన కాజల్ అగర్వాల్ , సంజన ,రాయ్ లక్ష్మి వంటి హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం ఆడియో విడుదలను ఈ నెల 20 న అట్టహాసంగా నిర్వహించనున్నారు . ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మరో హైలైట్. సర్దార్ సినిమాను పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ పై నిర్మించడం మరో విశేషం.

ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్స్ లో పవన్ కళ్యాణ్ అదిరిపోయే లుక్ తో అభిమానులను అలరిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను టార్గెట్ చేస్తూ ఈ సినిమా ట్రైలర్ ను చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఇంతకూ ముందు నటించిన ఒక సినిమా గుర్తోస్తుందంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఇటీవల విడుదలైన సర్దార్ సినిమా ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ నడిచి వస్తున్నా తీరు , గుర్రాలు , గన్ , మెడ పై ఎర్రటి తువ్వాలు వంటి అనేక అంశాలు ఉన్నా ఈ టీజర్ మాత్రం పవన్ వీరాభిమానులను తప్ప మిగత వారిని ఆకట్టుకోలేకపోయిందని.ఈ సర్దార్ చిత్రం చూస్తుంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన " గుడుంబా శంకర్ " సినిమా గుర్తోస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

గుడుంబా శంకర్ సినిమా కథలో వేలు పెట్టినట్లు గానే సర్దార్ సినిమాలో కుడా కథ విషయంలో పవన్ కళ్యాణ్ వేలు పెట్టినట్లు తెలుస్తోంది. బైక్ మీద స్టిల్స్ దగ్గర నుండి , చిన్న పిల్లలను వెనుక వేసుకుని ఉన్న సీన్ చూస్తుంటే గుడుంబా శంకర్ సినిమాలోని "లే లే లేలే " అనే పాటను గుర్తుకు చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు.

పవర్ స్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన "గుడుంబా శంకర్" సినిమాతో ఎన్నో అంచనాలతో వస్తున్న ఈ " సర్దార్ గబ్బర్ సింగ్ " సినిమాను పోలుస్తుండడంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఈ చిత్రం నిరుత్సాహ పరుస్తుందేమోనన్న సందేహం పవన్ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తుంది. మరి ఈ చిత్రం భవితవ్యం ఎంటో తేలాలంటే వచేనేల 8 వరకు ఆగాల్సిందే.

'సర్దార్' లేటెస్ట్ టీజర్ అదిరిపోయింది

పవన్ - దేవుడూ ఇష్టమే .. కానీ..

మహేష్‌ని కామెంట్‌ చేసిన పవన్‌

English summary

Pawan Kalyan's Upcoming movie was sardar gabbar singh and this movie was going to be released on April 8th.This movie teasers were released recently and attracted all the fans of Pawan Kalyan. But some were commenting on Pawan Kalyan's Sardar Gabbar Singh Movie by saying that this Sardar trailer was remembering Gudumba Shankar Movie movie which was the biggest flop in Pawan Kalyan movie history.