సర్దార్ మూవీ రివ్యూ

sardar movie review

12:14 PM ON 8th April, 2016 By Mirchi Vilas

sardar movie review

భారీ అంచనాల మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజై తెలుగు రాష్ర్టాల ప్రజలకు అసలైన ఉగాది పండుగను తెచ్చిపెట్టింది. గురువారం అర్ధరాత్రి నుండే సర్దార్ బెనిఫిట్ షోలతో ఉగాది పండుగను ముందుగానే తీసుకువచ్చింది.

పవన్‌కి ఉన్న క్రేజ్ కోసం కొత్తగా చెప్పాల్సిన పనేమీ లేదు. ఆ క్రేజిను క్యాష్ చేసుకునేందుకు ఎందరో నిర్మాతలు, డైరక్టర్‌లు క్యూ కడుతుంటారు. ఇప్పటికే మంచి ఫాంలో ఉన్న పవర్ స్టార్ నటించిన సర్దార్ పై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఉగాది కానుకగా విడుదల అయిన సర్దార్ గబ్బర్ సింగ్ ఆ అంచనాలను అందుకునే స్థాయిలోనే ఉందని చెప్పాలి. 

పవన్ మిత్రుడు శరత్ మరార్, సునీల్ లుల్ల నిర్మాణంలో తెరకెక్కిన సర్దార్ సినిమాను బాబీ డైరెక్ట్ చేసాడు.

ఇక ఈ సినిమా ఎలా ఉందంటే...

1/10 Pages

కథ

చిన్నప్పుడు అనాధగా తిరుగుతున్న ఒక కుర్రాడిని పోలీసాఫీసర్ తనికెళ్ళభరణి తీసుకువచ్చి పెంచి పెద్ద చేసి పోలీసాఫీసర్ ని చేస్తాడు. ఆ పోలీసాఫీసరే సర్దార్ గబ్బర్ సింగ్ (పవన్ కళ్యాణ్). ఎక్కడో ఇండో నేపాల్ బోర్డర్‌లో ఉద్యోగం చేసుకుంటున్న సర్దార్‌కు రతన్ పూర్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. రతన్‌పూర్‌లో బైరవ్ సింగ్ అనే విలన్ అక్కడి ప్రజలను పీడిస్తూ ఉంటాడు. అదే ఊరికి చెందిన రాజవంశానికి చెందిన యువరాణి అష్మిదేవి (కాజల్) తన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఆస్తిని సైతం అమ్మి అక్కడి ప్రజల బాగోగులను చూసుకుంటూ ఉంటుంది. ఈ నేఫథ్యంలో అక్కడకు వచ్చిన సర్దార్ అష్మిదేవితో ప్రేమలో పడతాడు. అలాగే బైరవ్ సింగ్ దుర్మార్గాలకు కూడా అడ్డువెళతాడు. దీంతో అష్మిదేవిని పెళ్ళి చేసుకోవడం ద్వారా సర్దార్‌కు కూడా చెక్ పెట్టాలని ప్రయత్నిస్తాడు. సర్దార్ రతన్ పూర్‌ను, ప్రేయసి అష్మిదేవిని ఎలా కాపాడుకోగలిగాడన్నదే కథ. 

English summary

Here is exclusive Sardaar Gabbar Singh Telugu Movie Review and Rating, Gross Collections. Keep checking for latest updates on Sardaar Gabbar Singh Telugu Movie.