'సర్దార్‌' విలన్‌ షిర్డీ యాత్ర!

Sardar villan went to Shirdi tour

01:32 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Sardar villan went to Shirdi tour

మాచో హీరో గోపిచంద్‌ నటించిన 'జిల్‌' చిత్రంతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన నటుడు కబీర్‌ దుహాన్‌ సింగ్‌. పేరుకు విలన్‌ అయినా మోస్ట్‌ స్టైలిష్‌ అండ్‌ గ్లామరస్‌ విలన్‌గా పేరు తెచ్చుకున్నాడు. అందుకే ఇప్పుడు ఈ విలన్‌ అందరికీ మోస్ట్‌ వాంటెడ్‌ అయ్యాడు. తెలుగులో సర్దార్ గబ్బర్‌సింగ్‌, డిక్టేటర్‌తో పాటు దాదాపు ఆరు సినిమాల్లో కబీర్‌ నటిస్తున్నాడు. వెండితెర పై విలన్‌గా కనిపించే కబీర్‌కి కొంచెం దైవ భక్తి ఎక్కువే. అందుకే న్యూఇయర్‌కి తన స్నేహితులతో కలిసి షిర్డీ యాత్రకు వెళ్లాడట. ఢిల్లీ సమీపంలో ఫరీదాబాద్‌లో జన్మించిన కబీర్‌, మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి ఇప్పుడు మోస్ట్‌ వాంటెడ్‌ విలన్‌గా వెలిగిపోతున్నాడు.

English summary

Sardar Gabbarsingh villan Kabeer Duhan Singh went to Shirdi tour on New Year.