నన్ను సీఎం లైంగికంగా వాడుకున్నారు

Saritha Nair sensational statement about CM

10:34 AM ON 5th April, 2016 By Mirchi Vilas

Saritha Nair sensational statement about CM

రాజకీయాల్లో అన్నీ సంచలనమే... ఒక్కోసారి పాత విషయాలు కూడా వెంటాడతాయి. ఇదిగో కేరళ లో అదే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోలార్ కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న సరితా నాయర్ గతంలో రాసిన ఓ లేఖ వెలుగు చూసింది. దీంతో అక్కడ కలకలం రేపింది. కేరళలో సంచలనం సృష్టించిన సోలార్ కుంభకోణంలో సరితా నాయర్ సహ నిందితురాలిగా ఉన్నప్పటినుంచీ ఆమె కేరళ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారిపోయారు. గతంలో సీఎం ఉమెన్ చాందీ కుమారుడు తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన ఆమె, ఈ లేఖలో కొడుకుతో పాటు తండ్రి కూడా వేధింపులకు పాల్పడ్డారని పేర్కొనడం తనను ఉమెన్ చాందీ లైంగికంగా వేధించారని ఆమె రాసిన లేఖ కాపీని ఆసియన్ నెట్ న్యూస్ ఛానల్ వెలుగులోకి తెచ్చింది.

ఈ లేఖ కాపీ పై ఆసియన్ నెట్ న్యూస్ ఛానెల్ ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తోంది. 2013, మార్చి 19న రాసినట్టుగా చెబుతున్న ఈ లేఖలో ఇంకా అనేక సంచలనాత్మక విషయాలు బహిర్గతమయ్యాయి. తాను ముఖ్యమంత్రికి లంచం కూడా ఇచ్చానని ఈ లేఖలో ఆమె ప్రస్తావించారు. దీని పై ఆమె స్పందిస్తూ, 'ఆ లేఖ నాదే. పోలీసు కస్టడీలో ఉండగా రాశా. అందులోని విషయాల గురించి చర్చించాలనుకోవడం లేదు. కానీ లేఖలో నేను రాసినవన్ని వాస్తవాలే' అని సరిత స్పష్టం చేసారు. అంతేకాదు ఉమెన్ చాందీతో పాటు కేంద్ర మాజీ మంత్రి తనను లైంగికంగా వేధించారని లేఖలో సరిత ప్రస్తావించారు.

ఈ లేఖను అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు ఆమె ఇవ్వాలనుకున్నారు. ముఖ్యమంత్రి చాందీ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి. దీని పై స్పందించిన ఉమెన్ చాందీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన పై పథకం ప్రకారం కుట్ర చేశారని ఆరోపించారు. ఎన్నికళ వేళ.. తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు శత్రువర్గం చేస్తున్న తుది ప్రయత్నమని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆరోపణలను పట్టించుకోబోనని, అయితే దీని పై సమగ్ర దర్యాప్తు జరుపుతామని అన్నారు.

English summary

Saritha Nair sensational statement about CM. Saritha Nair said that CM and his son used me physically.