ఇది ముమ్మాటికీశశికళ మార్ఫింగ్ ఫోటో… ఇంతకీ ఒరిజినల్ ఎవరిదీ?

Sasikala Fake Photo Viral In Whatsapp

05:54 PM ON 9th February, 2017 By Mirchi Vilas

Sasikala Fake Photo Viral In Whatsapp

ఇది మార్ఫింగ్ మాయాజాలం నడుస్తున్న కాలం. ఏది అసలో , ఏది నకిలీయో తెలీని విధంగా ఫోటోలను మార్చేసి, సోషల్ సైట్లలో, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేస్తుంటే, విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో లబో దిబో మంటున్నారు. ఇక ఇప్పుడు శశికళ వంతు వచ్చింది…. తమిళనాట రాజకీయాలా నేపథ్యంలో శశికళ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జయలలిత ఉన్నంత వరకు జయచాటు చిన్నమ్మలా తమిళనాడు వరకే పరిమితమైన ఈమె, ఒక్కసారిగా ప్రతాపం చూపిస్తోంది, అమ్మ మరణం తర్వాత టోటల్ ఇండియా అంతా పాపులర్ అయ్యింది, ఇక ఈ రెండు మూడు రోజులుగా నడుస్తున్న తమిళ రాజకీయ క్రీడలో భాగంగా శశికళ పేరు మరింత పాపులర్ అయ్యింది. ఇదే సమయంలో…. ఓ ఫోటో వాట్సాప్ , ఫేస్ బుక్స్ లో విపరీతంగా వైరల్ అయింది. అయిదేళ్ల క్రితమే శశికళ నిజస్వరూపం తెలిసి…జయలలితే స్వయంగా శశికళను పోలీసులతో మెడపట్టి గెట్టించిన ఫోటో అని.. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుంది.

ఇది మార్ఫింగ్ ఫోటో:

అయితే ఇది వాస్తవానికి ఓ మార్పింగ్ ఫోటో….దండుపాళ్యం సినిమాలో ఓ సీన్ లో ఉన్న మహిళ ప్లేస్ లో శశికళ ఫేస్ ను మార్ఫింగ్ చేసి వదిలారు. ఇక చూసుకోండి, ప్రస్తుతం శశికళ టాపిక్ ట్రెండింగ్ లో ఉన్న కారణంగా ఈ ఫోటో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఇది ఒరిజినలా? మార్ఫింగా అని పట్టించుకోకుండా…. ప్రతి ఒక్కరూ షేర్ చేస్తుండడం గమనార్హం.

ఇది ఒరిజినల్ ఫోటో:

అసలు ఒరిజనల్ ఫోటో ఇది. దీన్నో చూస్తే శశికళ ఫొటోలా మార్ఫింగ్ చేసిన మాయాజాలం వెలుగుచూస్తోంది.

English summary

Sasikala Fake Photo Viral In Whatsapp.