శశికళా పుష్ప భర్త, లాయర్లను చావగొట్టారు

Sasikala Pushpa Husband Attacked

11:08 AM ON 29th December, 2016 By Mirchi Vilas

Sasikala Pushpa Husband Attacked

అమ్మ జయలలిత ఉండగానే పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఆ పార్టీ రెబల్ ఎంపీ శశికళా పుష్ప పలుసార్లు వివాదాస్పద స్టేట్ మెంట్స్ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఇక అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద శశికళా పుష్ప భర్త, ఆమె తరఫు లాయర్లపై పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి పార్టీ కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం చేశారు. దాడి నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అన్నాడీఎంకే నుంచి శశికళ పుష్ప ఇటీవల సస్పెండ్ అయ్యారు. ఆమెకు పార్టీతో సంబంధం లేదంటూ అన్నాడీఎంకే కార్యకర్తలు ఆమె భర్తను, లాయర్లను ప్రతిఘటించారు.

జయలలిత వారసురాలి ఎంపికకు గురువారంనాడు పార్టీ కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ దాడి ఘటన చోటుచేసుకోవడం విశేషం. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పుష్ప నామినేషన్ పత్రం తీసుకుని ఆమె భర్త, లాయర్లు పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు వెళ్లినప్పుడు శిశకళా నటరాజన్ మద్దతుదారులుగా చెబుతున్న కొందరు వారిని అడ్డుకుని దాడి చేశారు. శశికళా నటరాజన్ కు పార్టీ సభ్యత్వం లేదని, అందువల్ల పోటీకి ఆమె అర్హురాలని, ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శి కాకుండా తాను అడ్డుకంటానని ఇటీవల శశికళ పుష్ప ప్రకటించారు. కాగా, బుధవారంనాడు పార్టీ కార్యాలయానికి వెళ్లిన తన లాయర్లపై దాడి చేసిన ఘటనను శశికళ పుష్ప ఖండించారు. తాను ఇప్పటికీ పార్టీ ఎంపీనేనని, తన సభ్యత్వం రద్దు కాలేదన్నారు. జనరరల్ సెక్రటరీ ఎన్నికలో పోటీకి తనకు అవకాశం ఉందని అన్నారు. ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలన్నారు.

ఇది కూడా చూడండి: కొత్త బట్టలైనా సరే ఒకసారి ఉతికాకే వేసుకోకపోతే ఏమవుతుందో తెలుసా..?

ఇది కూడా చూడండి: కేదారనాధ్ క్షేత్ర విశిష్టత ఏమిటో తెలుసా ...

English summary

Sasikala Pushpa Husband Attacked.