అందుకే బాహుబలిని పొడిచేసా

Sathyaraj Reveals Why He Killed Bahubali

12:05 PM ON 29th June, 2016 By Mirchi Vilas

Sathyaraj Reveals Why He Killed Bahubali

బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలిని కట్టప్ప చంపడం పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. అసలు ఎందుకు చంపాడు అంటే, సమాధానం లేదు. ఈ విషయం గురించి ఎవరిని అడిగినా ఏదో చెప్పేసి తప్పించుకుంటున్నారు. అయితే కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ మాత్రం కొంచెం ముందుకెళ్లి అసలు సంగతి చెప్పాడు. మిర్చి, బాహుబలి, నేను శైలజ, బ్రహ్మోత్సవం చిత్రాలతో అలరించిన సత్యరాజ్, ఆయన తనయుడు శిబిరాజ్ కలిసి నటించిన తమిళ చిత్రం జాక్సన్ దొరై తెలుగు ప్రేక్షకుల ముందుకు దొర గా జూన్ 1న వస్తున్న సందర్బంగా సత్యరాజ్ హైదరాబాద్ లో విలేకర్లతో ముచ్చటించారు. ఇటీవల నన్ను దృష్టిలో ఉంచుకొనే దర్శకులు పాత్రల్ని డిజైన్ చేస్తున్నారు. ఆ విషయంలో ఒక నటుడిగా గర్వపడుతున్నా. 200 సినిమాల మైలురాయిని అధిగమించాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాను.

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిజీగా కొనసాగుతున్నా. తెలుగులో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో తండ్రి పాత్రని పోషిస్తున్నా. తమిళంలో తెరకెక్కుతున్న పటాస్ రీమేక్ లో ఇక్కడ సాయికుమార్ చేసిన పాత్రని అక్కడ నేను పోషిస్తున్నా. నా ఈ 38 ఏళ్ల సినీ ప్రయాణంలో వందల సినిమాలు చేశాక ప్రేక్షకులంతా కట్టప్ప అంటూ పాత్ర పేరుతో పిలవడం ఎంతో గర్వంగా ఉంది. ఆ క్రెడిట్ అంతా బాహుబలి లో ఆ పాత్రని తీర్చిదిద్దిన రాజమౌళికే దక్కుతుంది.. జీవితంలో నటుడికి ఒక్కసారే ఇలాంటి పాత్ర వస్తుంటుంది' అని సత్యరాజ్ వివరించాడు. 'ఇక సినిమా చూసినప్పట్నుంచి అసలు బాహుబలిని ఎందుకు చంపారు? అని అడుగుతున్నారంతా. రాజమౌళి చెప్పాడు.. నేను చంపాను అని చెబుతుంటా' అని సత్యరాజ్ నవ్వేసాడు. "బాహుబలి: ది కన్ క్లూజన్" లో నా పాత్ర ఇంకా బలంగా ఉంటుందని కూడా చెప్పాడు. మొత్తానికి ఈ మిస్టరీ చెప్పకుండా తెలివిగా తప్పించుకున్నాడు సత్యరాజ్. అదండీ సంగతి.

ఇవి కూడా చదవండి:పాపం నాగ్ కి ఇద్దరూ హ్యాండిచ్చారా?

ఇవి కూడా చదవండి:కండల వీరుడిపై బిగుస్తున్న ఉచ్చు - రూ.10కోట్లకు పరువు నష్టం దావా

English summary

Bahubali Movie created Sensation all over India and the actors in the movie also got good craze and actor Sathya Raj also got good name and he was recognised with the name of Kattappa and in an interview he revealed the Secret that why Kattappa Killed Bahubali. Kattappa said that he killed Bahubali because the Director Said to Kill Him.