హైదరాబాద్‌కు సత్యనాదెళ్ళ రాక 

Satya Nadella To Visit Hyderabad

12:01 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Satya Nadella To Visit Hyderabad

హైదరాబాద్‌ ఐటి హబ్‌ ను దేశంలోనే ఉత్తమమైన ఐటిహబ్‌ గా తీర్చిదిద్దే లక్ష్యంతో అనేక పారిశ్రామిక విధివిధానాలను రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే తన విధివిధానాలతో అనేక మంది టాప్‌ పారిశ్రామిక వేత్తల మన్ననలు పొందింది.

ఇప్పుడు మరో నాలుగు కొత్త విధివిధానాలతో టి-సర్కార్‌ ముందుకొచ్చింది. ఈ నాలుగు కొత్త పాలసీలలో ఐటి, ఇన్నోవేషన్‌, గేమింగ్‌, హార్డ్‌వేర్‌ రంగాలకు హైదరాబాద్‌ లో మరింత ప్రోత్సాహం అందించే విధంగా ఈ కొత్త పాలసీ విధివిధానాలు ఉంటాయని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటిఆర్‌ అన్నారు.

ఈ నెల 28న మైకోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ళ హైదరాబాద్‌ కు రానున్నారని, ఆయన సమక్షంలో కొత్తగా రూపొందించిన పాలసీ విధివిధానాలను అవిష్కరించనున్నట్లు కెటిఆర్‌ తెలిపారు. ఈ కొత్త పాలసీలకు కార్యరూపం దాల్చడం ద్వారా అనేక మందికి ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందని ఆయన అన్నారు.

చెన్నై ఐటి సెక్టార్‌ను వరదలు ముంచెత్తడంతో భారీగా నష్టపోయిందని. ఇతర నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌ భిన్నమైన నగరమని, తుఫాన్‌లు, భూకంపాలు వంటి ఇతర పకృతి విపత్తులు లేని నగరం హైదరాబాద్‌ అని అన్నారు. హైదరాబాద్‌ వంటి సురక్షితమైన నగరంలో ఐటి పరిశ్రమలను స్థాపించాలని అన్నారు.

English summary

Microsoft CEO Satyanadella to visit hyderabad on december 28th. In his visit Telangana government to introduce four new policies to encourage IT industry in Hyderabad