హీరోగా చేస్తున్న కట్టప్ప!

Satyaraj is acting as a hero

03:25 PM ON 25th July, 2016 By Mirchi Vilas

Satyaraj is acting as a hero

అవును, సత్యరాజ్ బాహుబలికి ముందు తెలుగులో 'మిర్చి'లాంటి సినిమాల్లో నటించినా.. బాహుబలిలో చేసిన కట్టప్ప పాత్రతో ఒక్కసారిగా పిల్లల నుంచి పెద్దల వరకూ అందరిలో ఓ విధమైన క్రేజ్ సంపాదించాడు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే దానిపై, ఇంకా చర్చలు సాగుతూనే ఉంటే, మరోపక్క కట్టప్ప హీరో అవ్వడమేమిటని అనుమానం రావడం సహజం. నిజానికి తమిళంలో విలన్ గా మొదలైన సత్యరాజ్ కెరీర్ ఆ తరువాత హీరోగా మారాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్థానం సాగుతోంది. మళ్ళీ ఇప్పుడు హీరోగా చేయడానికి రెడీ అవుతున్నాడు. తన 'నందాంబాళ్' ఫిలిం ఫ్యాక్టరీపై సొంతంగా ఓ కిడ్నాప్ థ్రిల్లర్ నిర్మిస్తూ హీరోగా నటిస్తున్నాడట.

ఈ సినిమా గురించి సత్యరాజ్ చెబుతూ కార్తీక్ అనే నూతన దర్శకుడు చెప్పిన కధ తనకి బాగా నచ్చిందని, అందుకే చాలా కాలం తరువాత హీరోగా చేస్తున్నానని అంటున్నాడు. బాహుబలి కంక్లూజన్ తో బిజీగా వున్న సత్యరాజ్, హీరోగా కూడా మళ్ళీ తన సత్తా చాటనున్నాడు.

English summary

Satyaraj is acting as a hero