ఆవిధంగా ' వైఫై' వాడారంటే చర్యలేనట

Saudi Arabia Government Issues Fatwa Against WiFi Theft

01:40 PM ON 6th June, 2016 By Mirchi Vilas

Saudi Arabia Government Issues Fatwa Against WiFi Theft

సాంకేతికంగా జరుగుతున్న అభివృద్ధి నేపధ్యంలో అందివస్తున్న సౌకర్యాలపై కూడా గల్ఫ్ దేశాల్లో బ్యాన్ విధిస్తున్నారు. అసలే అక్కడ చట్టాలు ఎలా ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు కదా. ఇప్పుడు వైఫై మీదా ఆంక్షలు వచ్చేసాయి. ఇంతకీ ఇలా ఎందుకు చేసారంటే, స్మార్ట్ ఫోన్ లుంటే… వైఫై వినియోగం మామూలు స్థాయిలో ఉండదు. పక్కవాళ్ల ఇంటర్నెట్ ను అపరిమితంగా వాడేయ్యడానికి జనం ఏమాత్రం సంకోచించరు. అయితే ఇలాంటి వారిపై కఠిన చర్యలకు దిగుతామని సౌదీ అరేబియా ప్రభుత్వం అంటోంది.

అనుమతి లేకుండా ఇతరుల ఇంటర్నెట్ ను వాడితే చోరీగా భావించి కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడి అధికారులు ఫత్వా జారీ చేశారు. వైఫై వాడకాన్ని చోరీగా పరిగణించాలని ఫత్వాలో అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా రాజుకు సలహాలిచ్చే అధికారి అలీ అల్ హకామీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్కులు - ప్రైవేట్ షాపింగ్ మాల్స్ - హోటల్స్ - ప్రభుత్వ కార్యాలయాలలో పాస్ వర్డ్ లేకుండా ఉన్న వైఫై సౌకర్యాన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చునని అలాంటి సందర్భాలలో ఇది నేరం కింద పరిగణించబోమని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:నిత్య యవ్వనం కోసం టాబ్లెట్

ఇవి కూడా చదవండి:యాక్సిడెంట్ లో పురుషాంగాన్ని కోల్పోయాడు... ఆ పై 70 లక్షలు ఖర్చు పెట్టి....

English summary

A Saudi Arabian scholar has issued a fatwa against using another person’s WiFi without permission, in line with the Islamic ruling that theft is forbidden.