పెట్రోల్‌ ధర పెంచేసిన సౌదీ

Saudi Arabia Rises Petrol Price

04:01 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Saudi Arabia Rises Petrol Price

ప్రపంచంలో పెట్రోల్ ఎక్కువగా దొరికే దేశం సౌదీ అరేబియా. అన్ని దేశాల కంటే అతి తక్కువ ధరకు ఇక్కడ పెట్రోలు లభిస్తుంది. ఆ దేశంలో లీటరు పెట్రోలు ధర 0.60 రియాల్ లు (రూ. 15.80). కొన్నేళ్లుగా ఆర్థిక లోటుతో సతమతమవుతున్న సౌదీ సర్కారు.. పెట్రోలు ధరలను ఏకంగా 50 శాతం పెంచేసింది. దీంతో లీటరు ధర 0.60 రియాల్ ల నుంచి 0.90 రియాల్ లకు పెరిగింది. సౌదీ రాజు సల్మాన్ నేతృత్వంలో సమావేశమైన మంత్రిమండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పెట్రోలుతో పాటు విద్యుత్, మంచినీరు, కిరోసిన్, డీజెల్ తదితరాల ధరలనూ పెంచాలని మంత్రిమండలి నిర్ణయించింది. కాగా, పెట్రోలు ధరలు పెరిగాయన్న వార్త వెలువడిన వెంటనే, దేశవ్యాప్తంగా పెట్రోలు బంకులన్నీ మూతపడ్డాయి. తిరిగి కొత్త ధరలు అమలయ్యే మంగళవారం ఉదయమే బంకులు తెరుస్తామని పలు పెట్రోలియం సంస్థలు వెల్లడించాయి.

English summary