మొబైల్‌ డేటాను 70% ఆదా చేసుకోండిలా 

SAVE 70% OF INTERNET DATA

06:10 PM ON 5th December, 2015 By Mirchi Vilas

SAVE 70% OF INTERNET DATA

మొబైల్‌ డేటాను 70% వరకు తగ్గించే యాప్‌ వచ్చేసింది. మనం వేయించుకున్న ఇంటర్నెట్‌ డేటా చాలా త్వరగా అయిపోతుంటుంది. దీనికి ప్రధాన కారణం మనం బ్రౌజర్‌ లో ఓపెన్‌ వెబ్ పేజ్ లోని అనసరమైన కంటెంట్‌ లోడువుతూ ఇంటర్నెట్‌ డేటాను అయిపోయేలాగా చెస్తాయి.

ఇప్పడు ఆ బెడద లేకుండా మనకి కావలసిన ఫోటోలను మాత్రమే లోడ్‌ చేసుకుని మన ఇంటర్నెట్‌ డేటాను 70% ఆదా చేసుకునే యాప్‌ వచ్చేసింది. గూగుల్‌ సంస్ధ వారి గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ యొక్క తాజా అప్‌డేట్‌ లో డేటా సెవర్‌ మోడ్‌ అనే ఫీచర్ను ప్రవేశపెట్టింది . ఈ ఫీచర్ ద్వారా 70% మొబైల్‌ డేటాను ఆదా చేసుకోవచ్చుని గూగుల్‌ సంస్ధ వారు తెలిపారు.

ఈ ఫీచర్ను యాక్టివేట్ చేసుకోవడానికి గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ సెట్టింగ్స్‌ లోకి వెళ్ళి బ్యాండ్‌ విత్‌ మెనేజ్‌మెంట్‌ లోని "రెడ్యూస్‌ డేటా" అనే ఆప్షన్‌ను ఎనెబుల్‌ చేసిన తరువాత డేటాసెవర్‌ మోడ్‌ మీ గూగుల్ క్రోమ్‌ బ్రౌజరు లో యాక్టివేట్‌ అవుతుంది. ఈ అప్‌డేట్‌తో క్రోమ్‌ బ్రౌజర్‌ లో మీరు ఓపెన్‌ చేసిన వెబ్‌పెజ్‌లోని ఫోటోలను లోడ్‌ చెయ్యకుండా కేవలం టెక్ట్స్‌ ను మాత్రమే లోడ్‌ చేస్తుంది. ఆ తరువాత వెట్‌పెజ్‌లోని మనకి కావల్సన ఫోటోలను మనం లోడ్ చూసుకోవచ్చు.

ఈ అప్‌డేట్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లు ఉన్న ఇండియా, ఇండోనేషియా రెండు దేశాలలోనే గూగుల్‌ ఈ ఫీచర్ను విడుదల చేసింది. ఇంకేందుకు ఆలస్యం వెంటనే మీ ఫోన్‌లోనికి గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ను అప్‌డేట్‌ చేసి అతి తక్కువ డేటా తోనే బ్రౌజ్ చేసుకోండి.

English summary

A new feature in google chrome which saves upto 70% of mobile data. This update was released in two countries like india and indonesia