రాజ్ తరుణ్ ని తిరష్కరించిన అఖిల్ హీరోయిన్!

Sayesha Saigal rejected Raj Tarun

11:21 AM ON 28th June, 2016 By Mirchi Vilas

Sayesha Saigal rejected Raj Tarun

కెరీర్ ప్రారంభంలోనే మూడు విజయాలను అందుకుని హ్యాట్రిక్ హీరోగా పేరుగాంచిన రాజ్ తరుణ్ కి పరిస్థితి అంతగా బాగున్నట్టు లేదు. మొదట్లో టాలీవుడ్ లో మంచి డిమాండే ఉన్న ఇతగాడు, ఈడోరకం ఆడోరకం మూవీ హిట్టవ్వడంతో ఇతని క్రేజ్ మరింత పెరిగింది. వరుసగా మూడు సినిమాలు చేయడానికి నిర్ణయం జరిగినా, ఓ సినిమా ఎందుకో ఆగిపోయిందన్న వార్తలు హల్ చల్ చేశాయి. అది చాలదన్నట్లు అఖిల్ హీరోయిన్ సాయేషా సెహగల్ కూడా తిరస్కరించిందట. వచ్చిన అవకాశాన్ని ఈ అమ్మడు సున్నితంగా రిజెక్ట్ చేసేసిందట. ఈ విషయం ఆమె తల్లి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ తో రాజ్ తరుణ్ మూడు సినిమాల ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అందులో అప్పటికే ఒకటి(ఈడోరకం ఆడోరకం) పూర్తవ్వగా.. రెండో సినిమా తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ హారర్ కామెడీ చిత్రానికి వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ తొలుత సాయేషాకి వరించిందట. కానీ.. డేట్స్ కారణంగా ఆమె ఈ సినిమా రిజెక్ట్ చేసిందని సాయేషా తల్లి షాహీన్ తెలిపింది. బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వస్తుండడంతో రాజ్ తరుణ్ మూవీకి డేట్స్ కేటాయించలేక దాన్ని రిజెక్ట్ చేసిందని ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహీన్ పేర్కొంది.

ప్రస్తుతుం ఆమె అజయ్ దేవగన్ సరసన శివాయ్ లో నటిస్తోంది. ఇదికాక సాయేషా చేతిలో బోలెడన్ని ఆఫర్లు ఉన్నాయని, తనకు నచ్చిన స్టోరీలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తోందని షాహీన్ స్పష్టం చేసింది. మొత్తానికి రాజ్ తరుణ్ కి టైం బాగోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary

Sayesha Saigal rejected Raj Tarun