వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు.. వడ్డీలు తగ్గించిన బ్యాంకులు ఇవే!

SBI and private banks reduced interests for debt money

12:46 PM ON 18th November, 2016 By Mirchi Vilas

SBI and private banks reduced interests for debt money

మొత్తానికి ఎటొచ్చి ఇటొచ్చి పెద్ద నోట్ల రద్దు ప్రభావం వడ్డీ రేట్లపై పడింది. కొన్ని బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గిస్తే, మరికొన్ని బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. పాత నోట్లను మార్చుకునే క్రమంలో అన్ని బ్యాంకులకు డిపాజిట్లు ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడ్డాయి. సాధారణ స్థాయి కంటే బ్యాంకుల్లో రూ. 2 లక్షల కోట్ల అదనపు నిధులు వచ్చి చేరాయి. ఇలా వచ్చిపడిన నగదువల్ల బ్యాంకులకు 5.75 శాతం వడ్డీ మాత్రమే లభిస్తుంది. దీంతో నష్టాలు మూటగట్టుకోకుండా ఉండాలంటే వడ్డీరేట్లను సవరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఏడాది నుంచి 455 రోజులకు చేసిన డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

1/4 Pages

అంటే ఇకపై ఈ సెగ్మెంట్ లో 6.9 శాతం మాత్రమే వడ్డీ రేటు చెల్లిస్తారు. వడ్డీరేట్లు తగ్గుతాయని ఎస్బీఐ ఛైర్మన్ అరుంధతీ భట్టాచార్య ప్రకటించిన మరుసటి రోజే ఈ నిర్ణయం వెలువడింది. 455 రోజుల నుంచి రెండేళ్ల వరకు ఉండే డిపాజిట్లకు వడ్డీ రేట్లను 6.5 శాతానికి తగ్గించారు. ఇంత వరకు ఆ మొత్తాలకు 7.1 శాతం చెల్లించేవారు. 2 నుంచి 3 ఏళ్ల డిపాజిట్లకు 6.85 శాతం వడ్డీ రేటు చెల్లిస్తారు. ఇంతవరకు అది 7 శాతంగా ఉండేది. ప్రస్తుతం ఎస్బీఐ మొత్తం డిపాజిట్లు 1.12 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

English summary

SBI and private banks reduced interests for debt money