బాంబు లు తయారీ సంస్థలకు బ్యాంక్ లోన్లు?

SBI Bank Loans To Bomb Makers

10:51 AM ON 21st June, 2016 By Mirchi Vilas

SBI Bank Loans To Bomb Makers

బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘ కాలం నుంచి సేవలందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా చేసిందా అంటే అవుననే విధంగా వార్తలు వస్తున్నాయి. డచ్ క్యాంపైన్ గ్రూప్ PAX వెల్లడించిన నివేదిక ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయుధాలు తయారు చేసే సంస్థలకు లోన్లు ఇచ్చినట్టు నివేదిక పేర్కొంది. ఎస్.బి.ఐతో పాటు జెపీ మోర్గాన్, బార్ క్లేస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా లాంటి బడా సంస్థలు ఆయుధాలు తయారు చేసే కంపెనీలకు లోన్లు ఇచ్చిన జాబితాలో ఉన్నాయని తెలిపింది. వీటికి ఎస్.బీ.ఐ కూడా బాంబులు తయారు చేసే బడా కంపెనీలకు 28 బిలియన్ డాలర్లు ఆర్ధిక సాయం చేసిందని వెల్లడయ్యింది. అయితే అధికారులు మాత్రం ఈ నివేదిక లో నిజంలేదని బుకాయిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఎప్పుడూ స్థానిక నియమ నిబంధనల మేరకే పని చేస్తుందని, యూఎస్ లో అయినా, ఇండియాలోనైనా ఎటువంటి నిషేధాలుండవని చెప్పుకొచ్చింది.

అయితే ఆయుధాలు, బాంబులు తయారు చేసే సంస్థలకు ఆర్థికసాయం నిషేధిస్తూ 2008 లో ఒక అగ్రిమెంట్ కుదిరిందని, దీనిని సమర్ధిస్తూ 94 దేశాలు సంతకాలు కూడా చేశాయని గుర్తుచేస్తోంది. ఈ ఒప్పందం 2010 నుంచి అమల్లోకి వచ్చిన విషయాన్ని PAX తన 275 పేజీల రిపోర్ట్ లో పేర్కొంది. అంతేకాకుండా అయుధాలు,స్పేస్ రాకెట్లు తయారు చేసే యూఎస్ కు చెందిన ఆర్బిటల్ కంపెనీతో ఆర్థిక లావాదేవీలు జరిపినందుకు ఎస్.బీ.ఐని కూడా హోల్ ఆఫ్ షేమ్ జాబితాలో చేర్చారు. మరో వైపు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ ఎస్బీఐ ఆయా సంస్థలకు సుమారు 87 మిలియన్ యూఎస్ డాలర్ల సాయం అందించినట్టు Pax తన నివేదికలో ప్రస్తావించింది. ఎస్బీఐ మాత్రం ఎటువంటి తప్పుడు పనులకు పాల్పడలేదని, ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల నిబంధనల మేరకే తమ బ్యాంక్ ఆర్థిక సాయం అందచేస్తుందని పేర్కొంది. కాగా 2014 లో నిషేధిత జాబితాలో 151 సంస్థలుంటే, 2016 లో 112 సంస్థలున్నాయి. పాత జాబితాలో నుంచి 34 సంస్థలను తొలగిస్తే కొత్త జాబితాలో 44 సంస్థలు చేరాయి. మొత్తానికి ఈ వివాదం ఎటు దారి తీస్తుందో.

ఇవి కూడా చదవండి:జింబాబ్వేలో రేప్ కేసులో అరెస్టై రిలీజైన భారత క్రికెటర్ ఎవరు?

ఇవి కూడా చదవండి:పరీక్షల కోసం ఫేస్ బుక్, ట్విట్టర్ మూసేశారు

English summary

State Bank Of India was in the list of "Hall Of Shame" of banks funding cluster bomb makers list. State Bank of India said that they were given loans based on the rules and regulations of the respective countries.