ఫీచర్‌ఫోన్‌ వినియోగదారులకు ఎస్‌బిఐ కొత్తయాప్‌

SBI Releases New App For Feature Phone Users

07:02 PM ON 18th November, 2015 By Mirchi Vilas

SBI Releases New App For Feature Phone Users

ఎస్‌బిఐ బడ్డీ పేరుతో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు మొబైల్‌వాలెట్‌ యాప్‌ను విడుదల చేసిన ఎస్‌బిఐ కొత్తగా ఫీచర్‌ ఫోన్లకు బటువా పేరుతో ఒక యాప్‌ను విడుదల చేసింది.ఎస్‌బిఐ మేనేజింగ్‌ డైరక్టర్‌ రజ్నిష్‌ కుమార్‌ హైదరాబాద్‌లో ఈ యాప్‌ను విడుదల చేసారు. ఈ సందర్భంగా రజ్నిష్‌ మాట్లాడుతూ ఈ రోజుల్లో అందరిచేతుల్లో స్మార్ట్‌ ఫోన్లు, ఫీచర్‌ఫోన్లు ఉంటున్నాయని, ప్రత్యేకంగా ఫీచర్‌ఫోన్‌ వినియోగదారులు వాడుకునేందుకు వీలుగా బటువా యాప్‌ను రూపొందించామని తెలిపారు. ఈ యాప్‌ సాయంతో మనీట్రాన్స్‌ఫర్‌, టికెట్‌ బుకింగ్స్‌ వంటి పనులను సులువుగా చేసుకోవచ్చు. 13భారతీయ భాషలలో ఈ యాప్‌ అందుబాటులో ఉంది.

English summary

SBI Releases New App For Feature Phone Users