7వేల కోట్లు రుణ మాఫీ చేసిన ఎస్బిఐ.. ఆ లిస్ట్ లో విజయ్ మాల్యా!

SBI waiver the 7 thousand crores

11:55 AM ON 17th November, 2016 By Mirchi Vilas

SBI waiver the 7 thousand crores

ఓ పక్క అవినీతి, అక్రమాల నిరోధానికి పెద్ద నోట్లు రద్దుచేశామని చెప్పుకొస్తుంటే, మరోపక్క పెద్ద చేపలను వదిలేసిన వైనం ఇది. ఒకరా ఇద్దరా ఏకంగా 63 మంది పన్ను ఎగవేతదారులను వదిలేసారు. దీనివలన 7 వేల కోట్లు మాఫీ అయిపోయాయి. అవును నిజం. ఇండియాలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. 7 వేల కోట్ల రుణాలను సులభంగా మాఫీ చేసేసింది. ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగగొట్టిన వంద మంది డి ఫాల్టర్లు ఇప్పుడు ఖుషీ. ఈ టాప్ వందమంది ఎగవేతదారులు ఈ బ్యాంకుకు చెల్లించాల్సిన మొత్తంలో ఇది 80 శాతం పైగా ఎక్కువేనట. అడ్వాన్స్ అండర్ కలెక్షన్ అకౌంట్ కింద వీరంతా అప్పులు తీసుకున్నారు.

1/4 Pages

వీరినుంచి ఈ అప్పుల వసూలుకు ఈ బ్యాంకు చేసిన యత్నాలు చివరి దశకు చేరుకోవడంతో దాదాపు చేసేదిలేక చేతులెత్తేసింది. తన బ్యాలన్స్ షీట్ ను క్లీనప్ చేసుకునే పనిలో పడిందని అంటున్నారు. ఈలెక్కన రూ.7,016 కోట్ల విలువైన రుణాలను బ్యాంకు వదులుకున్నట్టే. జాబితాలోని 63 అకౌంట్లను పూర్తిగా మాఫీ చేయగా 31 ఖాతాలను పాక్షికంగా మాఫీ చేశారు. ఆరింటిని నిరర్థక ఆస్తులుగా తేల్చారు. గత జూన్ 30 నాటికి ఈ బ్యాంక్ 48 వేల కోట్ల విలువైన రుణాలు మాఫీ చేసింది.

English summary

SBI waiver the 7 thousand crores