మనం పాటించే సంప్రదాయాలు వెనకున్న సైంటిఫిక్ రీజన్స్ తెలిస్తే ఇక అవే ఫాలో అవుతారు!

Scientific reasons behind Indian traditions

04:03 PM ON 26th August, 2016 By Mirchi Vilas

Scientific reasons behind Indian traditions

శాస్త్రీయత, సైన్స్ జోడించి మరీ మన పూర్వికులు మనకు కొన్ని సంప్రదాయాలు ఏర్పాటు చేశారు. అందుకే మన భారతీయ సంస్కృతి.. సంప్రదాయాలు, పద్ధతులతో నిండి ఉంటుంది. కొన్నిసార్లు ఆ సంప్రదాయాల వెనక ఉన్న అసలు కారణం తెలియక వాటిని పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తాం. పైగా అవన్నీ ఒట్టి మూఢనమ్మకాలే అన్ని భావన మనలో ఏర్పడి పోవడం కూడా ఓ కారణం అనుకోండి. ఇండియన్స్ చాలా సంప్రదాయాలు పాటిస్తారు. కొన్ని తెలిసి, కొన్ని తెలియకపోయినా, పాటిస్తూ వస్తున్నారు. కొన్ని ఫ్యాషన్ స్టేట్మెంట్ లా అనిపిస్తాయి. కొన్ని చాలా బలవంతంగా చేస్తూ ఉంటారు.

అయితే.. కొన్నేళ్లుగా వస్తున్న ఈ ఆచారాలను వాళ్లు ఊరికే చెప్పలేదు. అవన్నీ మనకు ఎంతో ప్రయోజనాలను చేకూరుస్తాయి. అందుకే.. వాటిని సంప్రదాయం రూపంలో పాటించేలా అమలు చేశారు. ఇప్పుడు మన ఇండియన్స్ ఫాలో అయ్యే కొన్ని సంప్రదాయాలు, వాటి వెనక ఉన్న లాజిక్స్ గురించి తెలుసుకుందాం.

1/16 Pages

1. గాజులు వేసుకోవడం వలన...


పూర్వకాలంలో మగవాళ్లు చాలా కష్టపడేవాళ్లు. శారీరకంగా చాలా పనులు చేసేవాళ్లు. కానీ.. మహిళలు కేవలం ఇంటిపనికే పరిమితం అయ్యేవాళ్లు. ఇలా, ఎలాంటి శారీరక శ్రమ లేకుండా, ఇంట్లోనే ఉండటం వల్ల మహిళలు ఎక్కువగా హైబ్లడ్ ప్రెజర్ సమస్యతో బాధపడేవాళ్లు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మహిళలు, ఇలాంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలని భావించిన మన పూర్వీకులు. అందులో ముఖ్యంగా వాళ్ల చేతులకు గాజులు వేసుకునే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. మణికట్టుపై ఉండే గాజులు శరీరాన్ని యాక్టివేట్ చేస్తాయి. గాజులు ఒకదానికొకటి రాపిడి చేయడం వల్ల.. బ్లడ్ ప్రెజర్ నార్మల్ గా ఉంటుంది. గాజుల ద్వారా చర్మానికి ఎలక్ట్రిసిటీ అందుతుంది.

English summary

Scientific reasons behind Indian traditions