మనిషి చితాభస్మం నుంచి వజ్రాలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. ఎక్కడ?

Scientists are making diamonds from human ashes

12:05 PM ON 27th September, 2016 By Mirchi Vilas

Scientists are making diamonds from human ashes

ధనవంతులు మాత్రమే కొనగలిగే ఎంతో విలువైన రాయి వజ్రం. దీనికి ఎంత విలువ ఉంటుందో ఎవరైనా ఇట్టే చెప్పగలరు. కొన్ని వేల ఏళ్ల కిందట భూమిలో జరిగిన కొన్ని ప్రత్యేక క్రియల ద్వారా ఏర్పడ్డ ఖనిజాల నుంచి వజ్రాలను వెలికి తీస్తారు. ఈ ప్రక్రియ గురించి అందరికీ తెలుసు. అయితే ఈ భూ ప్రపంచంలో వజ్రాలను ఎవరు వెలికి తీసినా ఆ ప్రక్రియంతా ఒకేలా ఉంటుంది. కానీ మానవుడి చితాభస్మం నుంచి కూడా వజ్రాలను వెలికి తీయవచ్చట. ఎంత ఆశ్చర్యపోయినా ఇది నూటికి నూరుపాళ్లు నిజం అంటున్నారు. అమెరికాకు చెందిన ఓ సంస్థ ఇదే పద్ధతిలో వజ్రాలను వెలికి తీయవచ్చని నిరూపించింది కూడా. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

1/5 Pages

స్విట్జర్లాండ్ కు చెందిన అల్గోడ్డాంజా అనే కంపెనీ వారికి 33 దేశాల్లో పెద్ద పెద్ద ల్యాబొరేటరీలు ఉన్నాయి. వారికి ఉన్న అమెరికా బ్రాంచ్ ల్యాబ్ లో అక్కడి సైంటిస్టులు ఇటీవలే ఓ కొత్త పద్ధతిని కనుగొన్నారు. అదేమిటంటే, వారు చనిపోయిన మనుషులను దహనం చేశాక వచ్చే చితాభస్మం నుంచి వజ్రాలను వెలికితీసే విధానాన్ని కనిపెట్టారు. దీనికి మ్యాన్-మేడ్ డైమండ్ అనే పేరు కూడా పెట్టేశారు. సాధారణంగా ఒక వజ్రం సహజసిద్ధమైన పద్ధతిలో భూమిలో ఏర్పడాలంటే అందుకు కొన్ని వేల ఏళ్లు పడుతుందట. కానీ ఆ ల్యాబ్ వారు మాత్రం కేవలం కొన్ని వారాల్లోనే మనిషి చితాభస్మం నుంచి వజ్రాన్ని తయారు చేస్తున్నారట. ఇక స్మశానాల్లో చితాభస్మం కోసం దొంగతనాలు, కొట్లాటలు కూడా జరుగుతాయేమో.

English summary

Scientists are making diamonds from human ashes