బయోనిక్ పురుషాంగం సిద్ధం చేసిన అమెరికా శాస్త్రవేత్తలు!

scientists came with bionic penis

12:52 PM ON 30th November, 2016 By Mirchi Vilas

scientists came with bionic penis

ఇప్పటివరకూ మానవ శరీరానికి సంబంధించి ఎన్నో ఆవిష్కరణలు సైన్సు పరంగా జరిగినా ఇప్పుడు కీలకమైన పురుషాంగం అంశం మీద పరిశోధన చేసి ఓ అద్భుతాన్ని అమెరికా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. విషయం ఏమంటే, తీవ్రస్థాయి అంగస్తంభన లోపం ఉన్నవారి కోసం లోహపు పురుషాంగాన్ని అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. 8 అంగుళాల పొడవున్న ఈ సాధనాన్ని రిమోట్ కంట్రోల్ సాయంతో నియంత్రించవచ్చు. ఒక మీటను నొక్కడం ద్వారా రెండు నిమిషాల్లోనే వాడకానికి సిద్ధం చేసుకోవచ్చు. వయాగ్రా వంటి ఔషధాలు, ఇతర చికిత్సలు పనిచేయని వారిలో శృంగార జీవితాన్ని పునరుద్ధరించడానికి ఇది సాయపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

సాగే గుణమున్న లేటెక్స్ తో ఇది తయారైంది. దీనిపై నిటోనిల్ పూత ఉంటుంది. నికెల్, టైటానియంలతో తయారైన ఈ పదార్థాన్ని జ్ఞాపకశక్తి లోహంగా కూడా పేర్కొంటారు. వేడిమి, చల్లదనానికి అనుగుణంగా ఇది తన ఆకృతిని మార్చుకుంటుంది. ఇక దీనికి ఒకవైపున వేడెక్కే చిన్నపాటి లోహపు కాయిల్ ఉంటుంది.

పురుషాంగానికి కింద చిన్న కోత పెట్టడం ద్వారా దీన్ని అమరుస్తారు. శరీర ఉష్ణోగ్రత(37 డిగ్రీల సెల్సియస్) వద్ద ఇది చాలా చిన్నగా ఉంటుంది. గజ్జల్లో అమర్చిన రిమోట్ సాయంతో దీన్ని ఆన్ చేయవచ్చు. ఫలితంగా ఇది 42 డిగ్రీలకు వేడెక్కుతుంది.దీంతో పొడవు పెరిగి, స్తంభిస్తుంది. అందులోని చల్లబరచే వ్యవస్థ ద్వారా మళ్లీ దాన్ని కుదింపచేయవచ్చు. ఈ సాధనాన్ని త్వరలో జంతువులపై పరీక్షించనున్నారు. మానవులకు అందుబాటులోకి రావడానికి కొన్నేళ్లు పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

English summary

scientists came with bionic penis