భూమిలాంటి మరో గ్రహం ఉందా?

Scientists Discovered A New Planet Super Earth

11:31 AM ON 26th December, 2016 By Mirchi Vilas

Scientists Discovered A New Planet Super Earth

ఈ విశ్వంలో అన్ని గ్రహాలకీ లేని ప్రత్యేకత భూగ్రహానికి ఉంది. ఎందుకంటే ఇది జీవరాశులకు నివాస యోగ్యమైన గ్రహం. అయితే భూమిపైనే కాకుండా ఇతర గ్రహాలపైన నివసించే వాతావరణం ఉందా, లేదా అని పరిశోధకులు నేటికీ వారి పరిశోధనలు కొసాగిస్తూనే ఉన్నారు. ఈక్రమంలో నాసా పరిశోధకులు ఇటీవల ఒక గ్రహాన్ని గుర్తించారు. దాని పూర్వాపరాలేమిటో చూద్దాం.

భూమికి దూరంగా ఉన్న ఈ గ్రహాన్ని నాసాకి చెందిన కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ సెంటర్ గుర్తించింది. ఈ విషయాన్ని స్పేస్ క్రాఫ్ట్ లోని వ్యోమగాములు గుర్తించారు. ఈ గ్రహానికి సూపర్ ఎర్త్ అన్న పేరును నిర్ణయించారు. ఈ గ్రహం మన సౌరమండలానికి అవతల, అతి సమీపంలోనే ఉంది. దీని సైజు మన భూగ్రహం కన్నా కాస్త పెద్దది. అక్కడి వాతావరణం అంతా మన భూగ్రహాన్నే పోలి ఉందట. సూర్యుని నుంచి మరీ దూరంగా కాకుండా, అలాగని మరీ దగ్గరగా కాకుండా సమదూరంలో ఉన్నందువల్ల అందులో నీటి ఆనవాళ్లు కూడా ఉండే అవకాశం ఉందట. ఈ మేరకు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. నీటి ఆనవాళ్లు అనేకంటే అక్కడ ఒక పెద్ద సముద్రమే ఉన్నా ఆశ్చర్యం అవసరం లేదంటున్నారు. ఇదే కనుక నిజమైతే ఆ గ్రహంపై నివసించడానికి ఛాన్సు ఉంటుందని ఊహిస్తున్నారు.

సూపర్ ఎర్త్ కి సంబంధించి సూచనలను గత నాలుగు సంవత్సరాలుగా కెప్లర్ స్పేస్ క్రాఫ్ట్ అందిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ఈ గ్రహానికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ సంవత్సరం కూడా స్పేస్ క్రాఫ్ట్ అందించింది.

ఇది మన సౌరవ్యవస్థకి దూరంలో ఉంది. భూమి నుంచి దీని దూరం 150 మిలియన్ల కాంతి సంవత్సరాలు. ఈ సూపర్ ఎర్త్ ప్లానెట్ , ఇరవై మైళ్ల వ్యాసం కలిగి, భూమి కన్నా 1.5 రెట్లు పెద్దగా ఉంటుందని వారు చెబుతున్నారు. గ్రహంపై ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు ఉండొచ్చు. భూమి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో అలానే ఈగ్రహం కూడా సూర్యుని కన్నా చిన్నదైన నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. సూపర్ ఎర్త్ ఉన్న నక్షత్ర మండలాన్ని కొద్ది క్షణాల పాటు శాస్త్రవేత్తలు పరిశీలించారు. కెనడాకి చెందిన మరికొన్ని శాటిలైట్స్ ద్వారా కూడా ఈ నక్షత్ర మండలాన్ని గమనించి, సూపర్ ఎర్త్ ఉందన్న విషయాన్ని కనుగొన్నారు. ఇంకా దీనిపై వివిధ రకాలైన పరిశోధనలు కొనసాగించాలని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నివాస యోగ్యం అయితే, చాలామంది అక్కడే నివసించడానికి మొగ్గుచూపుతారేమో చూడాలి.

ఇవి కూడా చదవండి: రాత్రివేళ ఇవి తిన్నారో ఇక అంతే సంగతులు

ఇవి కూడా చదవండి: టైపాయిడ్ , చికున్ గున్యాలకు కొత్త వ్యాక్సిన్లు

English summary

So many researchers were in still researching for a new planet which would be able to live man kind and recently space scientists have been discovered a new planet and named it as super earth. This planet was 1.5 times bigger that Earth.