పీఎస్ఎల్వీ సి-31 సక్సెస్ తో శాస్త్రవేత్తల ఆనందం

Scientists Happy With PSLV C31 Success

10:39 AM ON 20th January, 2016 By Mirchi Vilas

Scientists Happy With PSLV C31 Success

పీఎస్ఎల్వీ సి-31 ప్రయోగం విజయవంతం కావడంతో ఇప్పతవరకూ, పీఎస్ఎల్వీ సిరిస్‌లోని 33 ప్రయోగాల్లో 32వ విజయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సాధించినట్టయింది. బుధవారం నాటి ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్త్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఒకరికొకరు అభినందలు తెలుపుకున్నారు. ఇక గతేడాది మార్చిలో చివరి నావిగేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించగా, మరో రెండు ఉపగ్రహాలను ప్రయోగిస్తే భారతీయ సొంత నావిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది. వచ్చే మార్చి నాటికి చివరి ప్రయోగం ఉంటుందని ఇస్రో అధికారులు అంటున్నారు.

నెల్లూరు జిల్లాలోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి బుధవారం ఉదయం 9.31గంటలకు స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహమైన పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ31(పీఎస్ఎల్వీ)ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించడంతో భారతీయ నావిగేషన్ సిస్టమ్ దిశగా మరో అడుగు ముందుకేసింది. ప్రయోగానికి 48గంటల ముందు ప్రారంభమైన కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా పూర్తిచేసున్న తర్వాత నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్‌ ద్వారా నావిగేషన్‌ వ్యవస్థకు సంబంధించిన 1,425 కిలోల ఐఆర్‌ ఎన్‌ఎస్‌ఎస్‌-1ఇ ఉప గ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ సీ31 వాహకనౌక 19 నిమిషాల 30సెకన్లలో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇది 33వ ప్రయోగం కాగా నావిగేషన్ శ్రేణిలో ఇస్రో పంపిన ఐదో ఉపగ్రహం ఇది. ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌ కుమార్ దగ్గరుండి ప్రయోగాన్ని పర్యవేక్షించారు. ఈ రాకెట్‌ ద్వారా నావిగేషన్‌ వ్యవస్థకు సంబంధించిన 1,425 కిలోల ఐఆర్‌ ఎన్‌ఎస్‌ఎస్‌-1ఇ ఉప గ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భూ స్థిర కక్ష్యకు 36వేల కిలోమీటర్ల ఎత్తున ఉపగ్రహాన్ని రోదసీలో నిలిపారు. తాజా ఉపగ్రహంతో గ్లోబల్‌ పొజిషినింగ్‌ సిస్టమ్‌(జీపీఎస్‌)కు మరింత ఉపయోగ పడుతుంది. ఈ రాకెట్‌ను భూమి నుండి వేగంగా నెట్టేందుకు రాకెట్ మొదటి దశలో ఆరు స్ట్ఫ్రాన్ ఎక్స్‌ఎల్ మోటార్లను బిగించారు. ఈ తరహా ఎక్స్‌ఎల్ ప్రయోగం మొదట చంద్రయాన్-1లో ఉపయోగించారు. ఎక్స్‌ఎల్ మోటార్ల ప్రయోగంలో ఇది 11వ ప్రయోగం కావడం విశేషం. కాగా పీఎస్ఎల్వీ-సీ31 ప్రయోగం విజయవంతం కావాలని వేడుకుంటూ షార్ అధికారులు స్వామివారిని మంగళవారం దర్శించుకున్నారు. ప్రయోగం విజయవంతం కావడంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ , ప్రధానమంత్రి నరేంద్రమోడీ హర్షం వ్యక్తంచేస్తూ , శాస్త్రవేత్తలను అభినందించారు.

English summary

Indian Scientists were happy with the success of PSLV C-31 satellite. Due to this Experiment India can improve its own navigation system.Indian Prime Minister Narendra Modi And President Pranab Mukherjee Congratulated Scientistc on this successful launch