అతిపెద్ద గ్రహాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు 

Scientists have discovered the largest planet

10:59 AM ON 29th January, 2016 By Mirchi Vilas

Scientists have discovered the largest planet

విశ్వంలో మరో అతి పెద్ద గ్రహాన్ని ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. దీని సౌర వ్యవస్థలో ఒకే గ్రహం ఉంది. దానికి 2massj2126-8140 అని పేరు పెట్టారు. దీని ద్రవ్యరాశి సౌరకుటుంబంలో అతి పెద్ద గ్రహమైన బృహస్పతి ద్రవ్యరాశికి 12 నుంచి 15రెట్లు అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. ఇది తన మాతృ నక్షత్రం నుంచి విడిపోయిన అతిచిన్న భాగమని ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త సైమన్‌ మర్ఫీ అన్నారు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లే.. ఇది కూడా తన మాతృ నక్షత్రం చుట్టూ తిరుగుతోందని తెలిపారు. ఇలా ఒకసారి చుట్టి రావడానికి సుమారు మిలియన్‌ సంవత్సరాలు పడుతుంది. దీని కక్ష్య సౌరకుటుంబం నుంచి ఇటీవల తొలగించిన ఫ్లూటో కక్ష్యకు సుమారు 140 రెట్లు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

English summary

Australian Scientists found a new Largest planet Planet in Solar System.This was said by Australian National University scientist simon Morphy and they named it as 2massj2126-8140