దక్షిణ మధ్య రైల్వే  సూపరూ..

SCR Wins Six Awards In Railway Week National Awards

04:35 PM ON 18th April, 2016 By Mirchi Vilas

SCR Wins Six Awards In Railway Week National Awards

జాతీయ స్థాయిలో ఒకే ఆర్థిక సంవత్సరానికి ఆరు అవార్డులను సొంతం చేసుకుని, దక్షిణ మధ్య రైల్వే అరుదైన ఘనతను సాధించింది. పలు విభాగాల్లో నిర్వహణా సామర్థ్యానికి ఈ అవార్డులు లభించాయి. 2015-16 ఆర్థిక సంవత్సరానికి, సివిల్‌ ఇంజనీరింగ్‌, సమగ్ర ఆరోగ్య సంరక్షణ, స్టోర్స్‌, వాణిజ్య విభాగం, భద్రతా విభాగాలతోపాటు కొత్తగా ఏర్పాటైన పర్యావరణ పరిరక్షణ విభాగంలో కూడా అత్యుత్తమ పనితీరును కనబరచినందుకు, ఫలితాలను సాధించినందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ అవార్డులను దక్కించుకొంది. ప్రకటించిన అవార్డులను కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు చేతుల మీదుగా దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ రవీంద్ర గుప్తా స్వీకరించారు.

ఇవి కూడా చదవండి:ఒక్క నిమిషం ఇంటర్నెట్ ఆగిపోతే..?

భువనేశ్వర్‌లో ఆదివారం జరిగిన 61వ రైల్వే వారోత్సవాల్లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. గుంటూరు డివిజనలోని నంద్యాల రన్నింగ్‌ రూంకు జాతీయ స్థాయిలో రెండవ స్థానం దక్కింది. ఇక ఉత్తమ పనితీరుకు గుర్తింపుగా దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగులు పి. చైతన్య (సీనియర్‌ డివిజనల్‌ ఆపరేషన్స మేనేజర్‌, సికింద్రాబాద్‌), ఎం. రమే్‌షకుమార్‌ (సీనియర్‌ డివిజనల్‌ ఇంజనీర్‌, గుంతకల్‌), డి. జయకర్‌ (సీనియర్‌ సెక్షన ఇంజనీర్‌, సిగ్నల్స్‌, సికింద్రాబాద్‌), ఎస్‌. తారకేశ్వరరావు (సీనియర్‌ టెక్నీషియన్, ఎలకో్ట్ర లోకోషెడ్‌, లాలాగూడ)లు జాతీయ స్థాయిలో ‘విశిష్ట సేవా అవార్డు’లను అందుకున్నారు. మరోవైపు ఆంగ్ల వ్యాస రచనా పోటీలకు సంబంధించి గెజిటెడ్‌ విభాగంలో సీసీఎం కార్యదర్శి కె.హరికిషోర్‌ సంయుక్త విజేతగా, నాన్ గెజిటెడ్‌ విభాగంలో ఇరిసెట్‌ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ ఫిరోజ్‌ ఫాతిమా అవార్డులు అందుకున్నారు.

ఇవి కూడా చదవండి:

చనిపోయిన తరువాత కూడా ప్రాణంతో ఉండేవి

ఊహకు అందని వింత ప్రదేశాలు

English summary

South Central Railway Wins 6 awards in Railway Week National Awards. South Central Railway Manager Ravindra Gupta was presented award by Central Railway Minister Suresh Prabhu.