మల్లాది విష్ణు కోసం గాలింపు 

Search For EX-MLA Malladi Vishnu

04:52 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Search For EX-MLA Malladi Vishnu

నిన్న మొన్నటి వరకు విజయవాడలో చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొన్న కాంగ్రెస్ నేత , మాజీ ఎంఎల్ఎ మల్లాది విష్ణు గత నాలుగు రోజులుగా అజ్ఞాతంలో గడుపుతున్నారు. ఈయనను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసారు. గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడ కృష్ణ లంక స్వర్ణ బార్ లో కల్తీ మద్యం ఘటనకు సంభందించి 5గురు మరణించగా , 20మంది వరకు అస్వస్థత కు గురై , కోలుకుంటున్నారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) ఏర్పాటు చేయగా , డిఐజి మహేష్ చంద్ర చడ్డా విచారణాదికారిగా వున్నారు. మల్లాది విష్ణు ఎ -9గా చేర్చారు. ఇప్పటికే ఆయన సోదరుడు శ్రీనివాస్ ని అదుపులో తీసుకున్న సిట్ బృందం విష్ణు కోసం గాలింపు చేపట్టింది. ఓడిశాలో ఉన్నారేమోనని అనుమానిస్తూ విష్ణు కోసం ఓ బృందాన్ని ఓడిశా కూడా పంపారని తెలుస్తోంది.

English summary

Recently some people died by drinking adulterated alcohol in vijayawada. The owner of that bar was ex-mla maalladi vishnu.Now police booked a case on him and police were in search of him