పఠాన్‌కోట్‌లో  కొనసాగుతున్న వేట

Search Operation Continues In Pathankot

11:34 AM ON 5th January, 2016 By Mirchi Vilas

Search Operation Continues In Pathankot

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంలోకి చొరబడిన ఉగ్రవాదుల కోసం నాలుగోరోజు కూడా వేట కొనసాగుతోంది. సోమవారం రాత్రి వరకు నిర్వహించిన కూంబింగ్‌ ఆపరేషన్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు చెబుతున్నారు. వైమానిక స్థావరం మొత్తం క్షుణ్ణంగా గాలించాక, సురక్షితంగా ఉందని ధ్రువీకరించే వరకు కూంబింగ్‌ కొనసాగుతుందని తెలిపారు. ఎన్‌ఎస్‌జీ, ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌ కమాండోలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. ఐఏఎఫ్‌ హెలికాప్టర్ల సాయంతో గాలింపు కొనసాగుతోంది. ఇక తామే ఈ పని చేసామంటూ ఓ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన సంగతి తెల్సిందే.

దాడిని ఖండించిన అమెరికా.....

కాగా పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల దాడి ఘటనపై స్పందించిస్తూ, దక్షిణాసియాలో ఉగ్రవాదం అందరికీ సవాలు విసురుతోందని అమెరికా పేర్కొంది. ఉగ్రవాద నిర్మూలనకు అన్ని దేశాలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చింది. దాడికి కుట్రపన్నిన ఉగ్రవాదులపై పాకిస్థాన్‌ చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడిని పాకిస్థాన్‌ విదేశాంగశాఖ ఖండించింది. భారత్‌ అందించిన సమాచారం ఆధారంగా పనిచేస్తున్నట్లు పాకిస్థాన్‌ ప్రకటించింది.

English summary

Army was still in search for terrorists who have attcaked air force station in pathankot,Punjab.Upto now 6 terrorists have been killed by army officials. On the other hand America opposed the attack on India