టైటానిక్‌ మళ్లీ వస్తోంది..

Second Version Of Titanic To Launch In 2018

11:05 AM ON 13th February, 2016 By Mirchi Vilas

Second Version Of Titanic To Launch In 2018

టైటానిక్‌ మళ్లీ వస్తోందంటే.. కొత్త సినిమా తీస్తున్నారని అనుకోకండి. నిజంగానే టైటానిక్ ఓడ రెడీ అవుతోంది.

నౌక మునిగిపోయిన శతాబ్దం తర్వాత ఇప్పుడు అచ్చం పాత టైటానిక్‌ షిప్‌లాగే టైటానిక్‌-2ను తయారుచేస్తున్నారు. ఈ నౌకను 2018లో ఉత్తర అట్లాంటిక్‌ సముద్రంలో ప్రయాణానికి ప్రవేశపెట్టనున్నారు. 1912లో టైటానిక్‌ నౌక తొలి ప్రయాణంలోనే మంచుకొండను ఢీకొని ప్రమాదానికి గురై దాదాపు 1500 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో వచ్చిన టైటానిక్‌ సినిమా విశేష ఆదరణ పొందింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన బిలియనీర్‌ క్లైవ్‌ పామర్‌, ఆయన బ్లూస్టార్‌ లైన్‌ కంపెనీ 300 మిలియన్‌ పౌండ్లు వెచ్చించి ‘టైటానిక్‌-2’ను రూపొందిస్తున్నారు. ఇది 270 మీటర్ల పొడవు, 53 మీటర్ల ఎత్తు, 40వేల టన్నుల బరువు ఉంటుంది. తొమ్మిది అంతస్థుల ఈ నౌకలో స్విమ్మింగ్‌ పూల్‌, టర్కిష్‌ బాత్‌, జిమ్‌లు ఉంటాయి. దీనిలో 2,400 మంది ప్రయాణికులు, 900 మంది సిబ్బంది ప్రయాణించవచ్చు. అన్ని రకాల ఆధునిక భద్రత ఏర్పాట్లతో దీనిని రూపొందిస్తున్నారు. అయితే పాత టైటానిక్‌ షిప్‌ మాదిరిగా తొలి ప్రయాణం సౌతాంప్టన్‌ నుంచి న్యూయార్క్‌కు కాదు.. చైనా తూర్పు ప్రాంతంలోని జైంగ్సు నుంచి దుబాయికి ప్రయాణించడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు బ్లూస్టార్‌ లైన్‌ చెపుతోంది.

English summary