సల్మాన్ గుట్టు తెల్సిపోయింది

Secret About Salman Affair With Lulia Vantur

04:24 PM ON 19th February, 2016 By Mirchi Vilas

Secret About Salman Affair With Lulia Vantur

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ - రొమేనియన్‌ మోడల్‌, టీవీ స్టార్‌ లులియా వంటూర్‌ని ప్రేమిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చినా, సల్మాన్‌ ఎప్పుడూ బయట పడలేదు. అయితే ఇప్పుడు సల్మాన్‌ గుట్టు రట్టు అయింది. ప్రస్తుతం లులియా బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నట్లు బాలీవుడ్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి. దీనివెనుక సల్మాన్ అండ దండా వున్నాయట. అయితే లులియాకి హిందీ బాష రాకపోవడం వెలితిగా భావించిన సల్మాన్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, చక్కటి హిందీ నేర్పడానికి ట్యూషన్‌ పెట్టించాడట. ఈ విషయం సల్మాన్‌ సన్నిహితు లే చెబుతున్నారట. అయితే ఈ ప్రయత్నం హిందీ సినిమాల్లో నటించేందుకా, లేక సల్మాన్‌ కుటుంబీకులతో కలిసిపోవడానికా అన్నది బాలీవుడ్‌లో ప్రస్తుతం గుసగుసలు వినిపిస్తున్నాయి. హిందీ రాకపోవడం వల్ల సల్మాన్‌ కుటుంబ సభ్యులతో ఆమె కలవలేకపోతోందని అందుకే ఆమెకు హిందీ నేర్పే ఏర్పాటు చేశారని ఆ కుటుంబానికి సన్నిహితులు అంటుంటే, కాదు సినిమా కోసమేనని సన్నిహిత మిత్రుల మాట గా వినిపిస్తోంది. మొత్తానికి సల్మాన్ తన గర్ల్ ఫ్రెండ్ గురించి భలే శ్రద్ధ తీసుకుంటున్నాడు కదా ...

English summary

Bollywood Top Hero Salman Khan’s love life has always been in news and the current lady love in his life Romanian model and TV presenter Iulia Vantur and Salman Khan’s alleged love affair has been the talk of the town in Bollywood. A news came to know from his dearest friends that he was teaching her Hindi language to mingle with his family.