అట్లతద్ది ఆచరిస్తే మహిళలకు ఏం జరుగుతుందో తెలుసా?

Secret and story behind atla taddi

11:19 AM ON 19th October, 2016 By Mirchi Vilas

Secret and story behind atla taddi

ఇది మొట్టమొదటిగా గౌరీ దేవి ఆచరించిన వ్రతం. గౌరీదేవి శివుని భర్తగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు సూచించాడు. నారదుని ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు. బంధువులకు, ఇరుగు పొరుగులకు వాయినాలు ఇస్తారు. సాయం సమయమందు వాయినాలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి, అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగుతారు.

దీనికి సంబంధించి రకరకాల కధలు ప్రచారంలో వున్నాయి. అయితే ఓ కధనం ప్రకారం అట్లతద్ది గురించి విపులంగా తెలుసుకుందాం.

1/14 Pages

1. చంద్రారాధనతో సౌభాగ్యం...


చంద్రారాధన ప్రధానమైన పూజ, చంద్రకళల్లో కొలువైవున్న శక్తి అనుగ్రహం చేత స్రీసౌభాగ్యము పెరుగుతుంది.

English summary

Secret and story behind atla taddi