సీతారామ, లక్ష్మణులు ఎలా చనిపోయారో తెలుసా?

Secret behind death of Lord Rama Sita and Lakshmana

03:37 PM ON 7th September, 2016 By Mirchi Vilas

Secret behind death of Lord Rama Sita and Lakshmana

సీతారాముల చరితం అంటే రామాయణం. దీని గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే సీతారాములు మనకు ఆరాధ్య దైవాలు. రాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్లడం, రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళడం, రాముడు యుద్ధం చేసి రావణుని చంపడం. సీతను తెచ్చుకోవడం అంతా మనకు తెలుసు. చాలా సినిమాల్లో చూసి ఉంటాం. కానీ సీతారాములు, లక్ష్మణుడు ఏవిధంగా చనిపోయారో చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే చాలా మంది ప‌ద్మ పురాణం చదువకపోవడమే. అదే ప‌ద్మ పురాణంలో చాలా స్పష్టంగా సీతారాములు ఏవిధంగా చనిపోయారో ఉందని అంటారు.

1/4 Pages

రాముడు సీతను లంక నుండి తీసుకువచ్చిన తర్వాత లోకం కోసం సీతకు అగ్నిప్ర‌వేశ ప‌రీక్ష పెడతాడు. ఈ కఠిన శిక్షలో సీత నెగ్గుతుంది. సీతను తీసుకువచ్చిన తర్వాత సీతారాముల పట్టాభిషేకం జరిగి ప్రజలను చాలా బాగా చూసుకుంటుంటాడు. ఆ సమయంలో సీత మరోసారి అగ్నిపరీక్ష ఎదుర్కోవలసి వస్తుంది. దానికి కారణం ఒక రజకుడు అన్నమాట. ఆ మాటలకు బాధపడి సీతను అడవిలో వదిలిపెట్టి రమ్మని అన్న ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు వదిలి పెట్టి వస్తాడు. వాల్మీకి కంటపడిన సీతను తన ఆశ్రమానికి తీసుకెళ్లడం, అక్కడ లవకుశల జననం జరగడం, చివరకు సీతమ్మ మళ్ళీ అయోధ్యకు తీసుకువచ్చే సమయంలో, సీత తన తల్లి భూదేవిని తనను ఈ భూమి మీద ఉండకుండా నీ ఒడిలోకి తీసుకెళ్లమని వేడుకుంటుంది.

English summary

Secret behind death of Lord Rama Sita and Lakshmana