క్రిష్ కి ఆ పేరు అమెరికా అమ్మాయి పెట్టిందా?

Secret behind director Krish name

11:08 AM ON 11th April, 2016 By Mirchi Vilas

Secret behind director Krish name

ఏడేళ్ల క్రితం టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు క్రిష్‌ తెలుగులో నాలుగు సినిమాలే తీసినా అవి మంచి హిట్ అయ్యాయి. ‘గమ్యం’ తో మొదలు పెట్టి ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’, ‘కంచె’ వరకూ దిగ్విజయంగా కొనసాగి, ఇప్పుడు ఏకంగా అగ్ర హీరో, నందమూరి నటసింహం, పైగా బాలయ్య వందో చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేసాడు. బాలయ్యతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని రూపొందించనున్న దర్శకుడు జాగర్లమూడి రాధకృష్ణ(క్రిష్‌) ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఓపెన్ హార్ట్‌ విత్ ఆర్కే కార్యాక్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అసలు ఈ క్రిష్‌ పేరెలా వచ్చిందన్న ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చాడు. 'అమెరికాలో ఫైనాన్షియల్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేసేవాడ్ని.

ఇది కూడా చదవండి: 'శృతి' మించి అందాలు ఆరబోసింది(వీడియో)

నా ద్వారా ఆఫీస్‌ ఫైల్స్‌ ఎక్కువగా వెళ్తుండేవి. నా సహోద్యోగులకు నా పూర్తి పేరు ఎలా పలకాలో తెలీక రాడీ, కృష్ణ, జాగర్‌, మూడీ అనేవారు. దీంతో కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ అయ్యేది. అందుకే మా డిపార్ట్‌మెంట్‌లోని ఒకామె ‘ఇప్పటినుంచి మిమ్మల్ని క్రిష్‌’ అని పిలుస్తానంది. ఒకే అన్నాను. అలా క్రిష్‌ పేరు వచ్చింది. ఇక్కడికి వచ్చాక అమెరికాతో అనుబంధం ఉండే బిజినెస్‌ ప్రారంభించా. అమెరికన్స్‌కు సౌలభ్యంగా ఉండేందుకు క్రిష్‌ పేరును కంటిన్యూ చేశా. ఇండస్ర్టీలోకి వచ్చాక రాధాకృష్ణ పేర్లు చాలా మందికి ఉండటంతో క్రిష్‌కే ఫిక్స్‌ అయ్యా. మా పేరెంట్స్‌ నాకు పెట్టిన పేరు రాధాకృష్ణ. క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ‘రాధ’ అని పిలుస్తారు. ఆడియన్స్‌ క్రిష్‌ అని పిలుస్తారు' అంటూ వివరించాడు.

ఇది కూడా చదవండి: మైనర్ అనుమతితో సెక్స్ చేసినా శిక్ష తప్పదట

English summary

Secret behind director Krish name. Director Krish revealed about his name that how will come for his that name.