దేవుడు జన్మనిచ్చాక.. మనిషి ఏం కోరుకున్నాడో తెలిస్తే మతిపోతుంది!

Secret behind human life

10:50 AM ON 23rd September, 2016 By Mirchi Vilas

Secret behind human life

మనిషిని సృష్టించింది దేవుడు. ఇది అందరికి తెలిసిన విషయమే..! అలాగే ఈ సృష్టిలో ఉన్న ప్రతీ ఒక్క జీవిని సృష్టించింది కూడా దేవుడే. ఈ విషయం కూడా తెలిసిందే. అయితే జీవుల పుట్టుక ముఖ్యంగా మనిషి పుట్టుక విషయంలో మనిషి అత్యాశ దేవుడు మొదట్లోనే కనిపెట్టేసాడని అంటారు. దీనికి సంబంధించి ఓ ఇంటరెస్టింగ్ కథ ప్రచారంలో వుంది. సావధానంగా వినండి..

1/7 Pages

కుక్కకి జన్మనిస్తాడు..

ఒక రోజు దేవుడు ఓ కుక్కని తయారు చేసాడు. రోజంతా ఇంటి ముందు కూర్చో. నీకు గట్టిగా అరిచే శక్తిని ఇస్తున్నా. ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చినా/ఎవరిమీదైనా అనుమానం వచ్చినా అరు. నేను నీకు 20 ఏళ్ళు ఆయుషుని ఇస్తా అని దేవుడు ఆ కుక్కతో ఇలా అన్నాడు. దీనికి కుక్క బదులిస్తూ, స్వామి ఇదేం బాలేదు, నేను అన్ని ఏళ్ళు అరవలేను. 10 ఏళ్లకే నా గొంతు పోతుంది. ఇంకో పదేళ్ళు మూగదానిలా బ్రతకాలి. అందుకే 10 ఏళ్ళు నీకు ఇచ్చేస్తున్నా. మిగిలిన 10 ఏళ్ళు మాత్రమే అరుస్తా అనడంతో, దేవుడు సరేనన్నాడు.

English summary

Secret behind human life